HariHara VeeraMallu : కూటమి ఎమ్మెల్యేలకు స్పెషల్ షో.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

HariHara VeeraMallu : కూటమి ఎమ్మెల్యేలకు స్పెషల్ షో.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

HariHara VeeraMallu

Updated On : July 22, 2025 / 7:31 PM IST

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి నిన్నటి నుంచి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా నేడు మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Also Read : Pawan Kalyan : యాక్టింగ్ చేస్తానో లేదో తెలీదు.. కానీ నిర్మాతగా.. మళ్ళీ ఆ సంస్థని బయటికి తీస్తున్న పవన్..

ఎమ్మెల్యేలకు స్పెషల్ షో ఏమైనా వేస్తారా? అసెంబ్లీలో అంతా మీ ఫ్యాన్స్ ఉన్నారు అని అడగ్గా పవన్ సమాధానమిస్తూ.. నేను ఏమి అనుకోలేదు. మీరు చెప్తే ఆలోచన బాగుంది. మా కూటమి ఎమ్మెల్యేలు అందరికీ స్పెషల్ షో వేస్తే బాగుంటుంది. కానీ నేను వేస్తే ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది. మా ఎమ్మెల్యేలు అడిగితే వేస్తాను అని అన్నారు. మరి ఏపీలో కూటమి ఎమ్మెల్యేలకు హరిహర వీరమల్లు స్పెషల్ షో ఉంటుందో లేదో చూడాలి.