Ustaad Bhagat Singh : పవన్ అభిమానితో హరీష్ శంకర్ డిబేట్.. ఫ్యాన్స్ మనోభావాలు పట్టించుకోరా?
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హరీష్ శంకర్ అండ్ పవన్ ఫ్యాన్ మధ్య డిబేట్. ఫ్యాన్స్ మనోభావాలు, అభిప్రాయాలు పట్టించుకోరా? పరిగణనలోకి తీసుకోరా?

Harish Shankar Debate with Pawan Kalyan fans on Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తరువాత ఈ కాంబినేషన్ లో మరోసారి మూవీ అనౌన్స్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ విషయంలో హరీష్ శంకర్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఏదో విధంగా డిబేట్ నడుస్తుంది. మొదటిలో ఈ సినిమా తమిళ్ ‘తేరి’కి రీమేక్ అని, ఆ తరువాత షూటింగ్ మొదలు పెట్టి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తే.. ఆ ఫొటోలో ఉన్నది పవన్ కాదు హరీష్ శంకర్ అని కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!
తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా, అది భీమ్లా సెట్ లోని ఫోటో అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. దీంతో ఒక అభిమాని దీని గురించి హరీష్ శంకర్ ని ప్రశ్నించాడు.
‘బొట్టు వెనుక విషయం ఏమిటి హరీష్ గారూ’ అని అడగగా, హరీష్ బదులిస్తూ.. “మీరు కూడా బొట్టు గురించి అడిగితే ఎలా మూర్తి గారు? అది మన సంప్రదాయం ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, రోజు పెట్టుకోవచ్చు. మిగతా విషయం వెండితెర మీద చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు. దానికి అభిమాని.. ‘పెట్టుకోవడం పెట్టుకోకపోవడం గురించి కాదు శంకర్ జీ. ఇక్కడ విషయం మీద క్యూరియాసిటీతో అడిగా’ అంటూ రిప్లై ఇచ్చాడు.
Chiranjeevi: ఇక అవి చాలంటోన్న మెగాస్టార్.. ఒరిజినాలిటీ కోసమేనట!
దానికి హరీష్ రెస్పాండ్ అవుతూ.. “పోస్టర్స్ వేసేది క్యూరియాసిటీ పెంచడం కోసం. థాంక్యూ ఫర్ యువర్ క్యూరియాసిటీ” అంటూ ట్వీట్ చేశాడు. ‘క్యూరియాసిటీ పెంచడం వరకు ఓకె అండీ. కానీ భీమ్లా భీమ్లా అంటున్నారు ఫ్యాన్స్. మరి దానికి కూడా ఓ సమాధానం ఇస్తే వాళ్లు సంతృప్తి చెందుతారు’ అని అభిమాని ప్రశ్నించాడు.
హరీష్.. “కామెంట్లదీ ఏముందిలెండీ మొన్న ఫస్ట్ పోస్టర్ లో ఉన్నది నేనే అన్నారు. కళ్యాణ్ గారితో సహా అందరం నవ్వుకున్నాం. కామెంట్లని పట్టించుకుంటే సినిమాలు ఎలా తీస్తామండీ. ఇంకా నయం హీరో గారిని కూడా భీమ్లా సినిమాలో హీరో గారిని పెట్టారు అనలేదు” అంటూ రిప్లై ఇచ్చాడు.
అభిమాని.. ‘అంటే మీరు ఫ్యాన్స్ మనోభావాలు, అభిప్రాయాలు పట్టించుకోరా? పరిగణనలోకి తీసుకోరా?’ అంటూ ప్రశ్నించాడు. దానికి హరీష్ రియాక్ట్ అవుతూ.. “నేనూ ఫాన్స్ లో ఒకడ్నే అండీ. కాకపోతే ట్విట్టర్ లో కామెంట్స్ చేసేవాళ్ళంతా ఫాన్స్ అనుకోవడం పొరపాటు” అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్స్ తరువాత హరీష్ శంకర్ మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేయడం విశేషం.
మీరు కూడా బొట్టు గురించి అడిగితే ఎలా “మూర్తి “గారు ??
అది మన సంప్రదాయం ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, రోజు పెట్టుకోవచ్చు…
……. మిగతా విషయం వెండితెర మీద చూడండి ???? https://t.co/nfevBS8DKb
— Harish Shankar .S (@harish2you) May 10, 2023
పోస్టర్స్ వేసేది క్యూరియాసిటీ పెంచడం కోసం… థాంక్యూ ఫర్ యువర్ క్యూరియాసిటీ.?? https://t.co/wss2UZDjoY
— Harish Shankar .S (@harish2you) May 10, 2023
కామెంట్లదీ ఏముందిలెండీ మొన్న ఫస్ట్ పోస్టర్ లో ఉన్నది నేనే అన్నారు, కళ్యాణ్ గారితో సహా అందరం నవ్వుకున్నాం… కామెంట్లని పట్టించుకుంటే సినిమాలు ఎలా తీస్తామండీ ?!.
ఇంకా నయం… హీరో గారిని కూడా భీమ్లా సినిమాలో హీరో గారిని పెట్టారు అనలేదు..? https://t.co/PPoGr94PkD
— Harish Shankar .S (@harish2you) May 10, 2023
నేనూ ఫాన్స్ లో ఒకడ్నే అండీ… కాకపోతే ట్విట్టర్ లో కామెంట్స్ చేసేవాళ్ళంతా ఫాన్స్ అనుకోవడం పొరపాటు. https://t.co/W8sJs4MihL
— Harish Shankar .S (@harish2you) May 10, 2023
భగవద్గీత……. ????? https://t.co/gr2eiof37q
— Harish Shankar .S (@harish2you) May 10, 2023