Pawan Kalyan : హరిహర వీరమల్లు సెట్ నుంచి పవన్ తో ఫోటో పోస్ట్ చేసిన హారిష్ శంకర్.. వైరల్ అవుతున్న పిక్..
తాజాగా హరీష్ శంకర్ హరిహర వీరమల్లు సెట్ కి వెళ్లారు. సెట్ లో పవన్ కళ్యాణ్, చిత్ర యూనిట్ ని కలిశారు. హరీష్ శంకర్ సెట్ లో పవన్, క్రిష్, నిర్మాతలతో కలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో...........

Harish Shankar photo with Pawan Kalyan in Harihara veeramallu sets goes viral
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలకి, అటు రాజకీయాలకి టైం ఇస్తూ సినిమాలని చాలా స్లోగా చేస్తున్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా కరోనా వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవల ఈ సినిమా వర్క్ షాప్ జరగగా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ పని చేస్తున్నారు. ఇన్నాళ్లు నత్తనడకన సాగిన షూటింగ్ రెండు వారాల నుంచి పరిగెడుతుంది. ఇప్పటికే సినిమా సెట్ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ చిత్ర యూనిట్ షేర్ చేశారు. తాజాగా హరీష్ శంకర్ హరిహర వీరమల్లు సెట్ కి వెళ్లారు. సెట్ లో పవన్ కళ్యాణ్, చిత్ర యూనిట్ ని కలిశారు.
Prabhas : సింగీతంతో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..
హరీష్ శంకర్ సెట్ లో పవన్, క్రిష్, నిర్మాతలతో కలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఆ సినిమా గెటప్ లో, రఫ్ గడ్డం లుక్ లో ఉండటంతో అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.
Had a great time on the sets of #HHVM thank you @DirKrish for the reception @MythriOfficial
Let’s Rock !!!!! pic.twitter.com/FbiKL2BydF— Harish Shankar .S (@harish2you) December 9, 2022