Manchu Manoj : చిన్నారి ఘటనపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..

చిన్నారి కుటుంబ సభ్యులను టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ పరామర్శించారు.. వారిని ఓదారుస్తూ ఆయన భావేద్వేగానికి గురయ్యారు..

Manchu Manoj : చిన్నారి ఘటనపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..

Manchu Manoj

Updated On : September 14, 2021 / 1:40 PM IST

Manchu Manoj: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుర్మార్గుడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ పరామర్శించారు. వారిని ఓదారుస్తూ భావేద్వేగానికి గురయ్యారాయన.

Atrocity In Hyderabad : హైదరాబాద్‌లో దారుణం…చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన యువకుడు

అంతకుముందు రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు సాయి ధరమ్ తేజ్‌ని పరామర్శించారు మనోజ్. అలాగే సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైన సంఘటన గురించి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిందితుడిని ఎన్ కౌంటర్ చెయ్యాలన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు..

‘‘ఆ పసిపాపకు జరిగింది అన్యాయం కాదు.. క్రూరత్వం.. మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాలి.. ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారు.. ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలి.. చత్తీస్‌ఘడ్‌లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చింది.. 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాలి.. చిన్నారి ఫామిలీకి ఎల్లవేళలా తోడుగా ఉంటా’ అన్నారు.