Venatesh : హిట్ 3 డైరెక్టర్ కొడుకు – వెంకీమామ ఇంత క్లోజా? వెంకటేష్ కి ఫ్లాప్ ఇచ్చినా శైలేష్ ఫ్యామిలీ మెంబర్ అయ్యాడట..

వెంకటేష్ తో సైంధవ్‌ అనే సినిమా కూడా తీసాడు శైలేష్ కొలను.

Venatesh : హిట్ 3 డైరెక్టర్ కొడుకు – వెంకీమామ ఇంత క్లోజా? వెంకటేష్ కి ఫ్లాప్ ఇచ్చినా శైలేష్ ఫ్యామిలీ మెంబర్ అయ్యాడట..

HIT 3 Director Sailesh Kolanu Comments on Relation With Venkatesh after Saindhav

Updated On : May 4, 2025 / 3:59 PM IST

Venatesh – Sailesh Kolanu : హిట్ యూనివర్స్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు శైలేష్ కొలను. ఈ మధ్యలో వెంకటేష్ తో సైంధవ్‌ అనే సినిమా కూడా తీసాడు శైలేష్ కొలను. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ సినిమా నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్లాప్ గానే మిగిలింది సైంధవ్‌. అయితే సినిమా ఫ్లాప్ అయినా శైలేష్ కొలను వెంకటేష్ కి ఫ్యామిలీ మెంబర్ లా క్లోజ్ అయ్యాడట.

తాజాగా హిట్ 3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను మీడియాతో మాట్లాడుతూ వెంకటేష్, సైంధవ్‌ ప్రస్తావన రావడంతో వెంకటేష్ తో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం చెప్పుకొచ్చాడు.

Also Read : Sailesh Kolanu : ఫ్యామిలీతో ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్న శైలేష్ కొలను.. హిట్ 4 ఇప్పట్లో లేనట్టే.. మరి నెక్స్ట్ ఏంటి?

శైలేష్ కొలను మాట్లాడుతూ.. సైంధవ్‌ నిరాశపరిచింది. వెంకటేష్ గారితో ఇంకో సినిమా చేసి కచ్చితంగా ఆయనకు హిట్ ఇస్తాను. సినిమా రిలీజయ్యాక ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వెంకటేష్ గారు నాకు రోజూ ఫోన్ చేసేవాళ్ళు, కలిసేవాళ్ళం, బాగా మాట్లాడుకునేవాళ్ళం. అలా మేము బాగా క్లోజ్ అయ్యాం. ఆయన మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. నన్ను ఆయన ఫ్యామిలీలా చూస్తారు. వెంకటేష్ గారు నా కొడుకుతో చాలా క్లోజ్ గా ఉంటాడు. వెంకీమామ అని మాట్లాడతాడు. మా అబ్బాయి అంటే వెంకటేష్ గారికి ఇష్టం. మా అబ్బాయి ఫోటోలు, వీడియోలు వెంకటేష్ గారికి పంపిస్తే ఆయన కూడా రిప్లైలు ఇస్తూ ఉంటారు. మా అబ్బాయి వెంకటేష్ లాగా ఫోటోలు దిగి వెంకీమామకు పంపించు అంటాడు. రీసెంట్ గా చెట్లు కొట్టే ఇష్యూ అయినప్పుడు వెంకటేష్ గారికి ఫోన్ చేసి.. వెంకీమామ చెట్లు కొట్టేస్తున్నారు ఏదో ఒకటి చెయ్ మామ అని కంప్లైంట్ చేసాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అని చెప్పుకొచ్చారు.

దీంతో వెంకటేష్ కి సైంధవ్‌ సినిమా ఫ్లాప్ ఇచ్చినా శైలేష్ కొలను ఫ్యామిలీతో బాగా క్లోజ్ అయ్యారు అని తెలుస్తుంది. వెంకటేష్ మంచితనం గురించి అందరికి తెలిసిందే.

Also Read : Bullet Bhaskar : జబర్దస్త్ కి రాకముందు బులెట్ భాస్కర్ ఏం చేసేవాడో తెలుసా? యాంకర్ ప్రదీప్ లాగే..