Honey Rose: హనీ మనోభావాలను దెబ్బతీస్తున్నారా.. ఒక్కటి కూడా లేదే..?
మలయాళ బ్యూటీ హనీ రోజ్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది.

Honey Rose Not Getting Offers In Tollywood
Honey Rose: మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఇటీవల టాలీవుడ్‌లో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీలో నటించిన ఈ బ్యూటీ, ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ సినిమాలో అమ్మడి అందం, పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్‌కు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. వీరసింహారెడ్డి సినిమాతో హనీకి సాలిడ్ గుర్తింపు లభించింది.
Honey Rose : నాకు నచ్చిన డ్రెస్ లు వేసుకుంటా.. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది మా ఇష్టం..
సినిమా సక్సెస్ అయ్యింది.. అమ్మడికి గుర్తింపు వచ్చింది.. అయినా కూడా సినిమా ఛాన్స్‌లు రావడం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. హనీ రోజ్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోగలదని ప్రూవ్ చేసుకుంది. అయితే, ఆమెకు ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రాలేదని తెలుస్తోంది. వరుసగా షోరూమ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లతో సందడి చేస్తున్న ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Honey Rose: పెళ్లికి రెడీ అయిన హనీ రోజ్.. దానికోసం ఏమైనా చేస్తుందట!
వీరసింహారెడ్డిలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ చిందులు వేసిన ఈ బ్యూటీకి ఇప్పటికైనా ఆఫర్స్ వస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. మరి హనీ రోజ్ దర్శకనిర్మాతల చూపుల్లో ఎందుకు పడటం లేదో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.