Hello Guru Prema Kosame: రామ్ సినిమాకి హిందీలో భారీ రెస్పాన్స్!

ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాల మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలకన్నా ఇప్పుడు అక్కడ ప్రేక్షకులకు మన సినిమాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Hello Guru Prema Kosame: రామ్ సినిమాకి హిందీలో భారీ రెస్పాన్స్!

Hello Guru Prema Kosame

Updated On : February 14, 2022 / 11:25 AM IST

Hello Guru Prema Kosame: ఉత్తరాది ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాల మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. బాలీవుడ్ సినిమాలకన్నా ఇప్పుడు అక్కడ ప్రేక్షకులకు మన సినిమాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే పుష్ప లాంటి సినిమా అక్కడ వందకోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక్క థియేటర్లలోనే కాదు.. యూట్యూబ్ లో కూడా మన సినిమాలకి అక్కడ భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రతి తెలుగు సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

Bheemla Nayak: మరో సాంగ్ లీక్.. నిన్న మహేష్ నేడు పవన్!

డబ్బింగ్ సినిమాల ద్వారా మన హీరోలు నార్త్ లో కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. యంగ్ హీరో రామ్ పోతినేని నేను శైలజా హిందీ డబ్బింగ్ సినిమా గతంలో యూట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు రామ్ మరో సినిమా కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హలో గురూ ప్రేమకోసమే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి నార్త్ నుండి భారీ రెస్పాన్స్ దక్కుతుంది.

Jagapathi Babu : అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు, పద్మ భూషణ్‌లు ఇవ్వాలి

ఇప్పటికే యూట్యూబ్ లో హలో గురూ ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్ 400 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. రామ్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇందుకోసం ముందుగా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ్ బైలింగ్యుల్ సినిమా చేస్తున్నాడు. ఇది సౌత్ అన్ని బాషలలో విడుదల కానుంది. యూట్యూబ్ లో డబ్బింగ్ సినిమాలకు భారీ రెస్పాన్స్ వస్తుండడంతో రామ్ కొత్త సినిమాలు హిందీలో కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది.