I Bomma : ఐ బొమ్మ క్లోజ్..? నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో ఎన్ని కోట్లు ఉన్నాయంటే..

ఆన్‌లైన్ పైర‌సీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ (i Bomma) నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి ర‌విని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

I Bomma : ఐ బొమ్మ క్లోజ్..? నిర్వాహకుడు అరెస్ట్.. అకౌంట్ లో ఎన్ని కోట్లు ఉన్నాయంటే..

ibomma operator emmadi ravi arrested

Updated On : November 15, 2025 / 11:57 AM IST

i Bomma : ఆన్‌లైన్ పైర‌సీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి ర‌విని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర‌వారం ఫ్రాన్స్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌విని సీసీఎస్ పోలీసులు కూక‌ట్‌ప‌ల్లిలో అదుపులోకి తీసుకున్నారు.

సినీ ప‌రిశ్ర‌మ‌కు భారీ న‌ష్టాన్ని క‌లిగించ‌డ‌మే కాకుండా పోలీసుల‌కు బ‌హిరంగంగా ర‌వి స‌వాల్ విసిరాడు. గ‌త ఆరు నెల‌లుగా పోలీసులు అత‌డి కోసం గాలిస్తున్నారు. క‌రేబియ‌న్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకున్న త‌రువాత ఆయ‌న బ్యాంక్ అకౌంట్ల‌లో ఉన్న రూ.3 కోట్ల న‌గ‌దును ప్రీజ్ చేశారు.

Prabhas : మళ్ళీ డ్యాన్స్ మాస్టర్ తో ప్రభాస్ సినిమా.. అప్పుడు ప్రభుదేవా, లారెన్స్.. ఇప్పుడు ఎవరంటే?

ఐ-బొమ్మ వ‌ల్ల సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం వాటిన‌ట్లు అంచ‌నా. ఓటీటీల్లో, థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాల హెచ్‌డీ ప్రింట్ల‌ను కొన్ని గంట‌ల్లోనే ఈ వైబ్‌సైట్‌లో అక్ర‌మంగా పైర‌సీ చేసి ఉచితంగా అందిస్తూ వ‌చ్చింది. ఈ విష‌య‌మై సినీ నిర్మాత‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.