Mumbai : షారుఖ్ ఖాన్ పోలికలతో ఉన్న ఇతనెవరో తెలుసా?
నడక, డ్యాన్స్, హావభావాలు.. అన్నీ షారుఖ్ ఖాన్‌లా అనిపిస్తారు. ఇబ్రహీం ఖాద్రీని చూస్తే ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు. కావాలంటే మీరే చూడండి.

Mumbai
Mumbai : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. అచ్చంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను పోలిన మనిషి ముంబయి స్ట్రీట్స్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఇబ్రహీం ఖాద్రీని చూసినవారంతా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అచ్చంగా షారుఖ్ ఖాన్ పోలికలతో ఉండే అతనికి సోషల్ మీడియాలో మాంచి క్రేజ్ ఉంది. చూడటానికి యంగ్‌గా కనిపిస్తున్న ఇబ్రహీం ఖాద్రీ వయసు 57 సంవత్సరాలు అంటే నమ్మశక్యం కాదు. ఇన్ స్టాగ్రామ్ లో 8.81 లక్షల ఫాలోవర్స్‌తో ఇబ్రహీంకు గుర్తింపు ఉంది. ఆయన షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇబ్రహీం ముంబయి వీధుల్లో షారుఖ్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అర్జీత్ సింగ్ పాట ‘చలేయా’ ను రీక్రియేట్ చేసారు. మరో వీడియోలో దుబాయ్‌లో షారుఖ్ నడకను అనుకరిస్తూ కనిపించారు. ఇక ఖాద్రీ షారూఖ్‌కి వీరాభిమాని అట. జవాన్ మొదటిరోజు మొదటి షో చూసారట.
‘చలేయా’ అంటూ ఇబ్రహీం ఖాద్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (ibrahim__qadri) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. డూప్లికేట్ షారుఖ్ ఖాన్.. అచ్చంగా షారుఖ్ లా ఉన్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ మిమ్మల్ని చూస్తే ఇంప్రెస్ అవుతారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram