Arya 2 : అల్లు అర్జున్ ‘ఆర్య 2’ రీ రిలీజ్.. పండగ పూట ఫ్యాన్స్ కి శుభవార్త.. ఎప్పుడో తెలుసా?
అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది.

Icon Star Allu Arjun Arya 2 Movie Re Releasing Date and Details Here
Arya 2 : గత కొంతకాలంగా పాత సినిమాలు ప్రతివారం ఏదో ఒకటి రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఒకప్పటి హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరింది. పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. గతంలో అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా రీ రిలీజ్ అయింది.
ఇప్పుడు అల్లు అర్జున్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన ఆర్య 2 రీ రిలీజ్ కాబోతుంది. నేడు ఉగాది పండగ పూట ఈ విషయాన్ని ప్రకటించారు. ఆర్య 2 సినిమా ఏప్రిల్ 5 శనివారం నాడు రీ రిలీజ్ కాబోతుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, కాజల్, నవదీప్ మెయిన్ లీడ్స్ గా ఆర్య సినిమాకు సీక్వెల్ గా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆర్య 2 కమర్షియల్ గా యావరేజ్ అయినా పాటలు పెద్ద హిట్ అయి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఆర్య 2 రీ రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ లో సందడి చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.