Ileana : 12 ఏళ్ళ వయసులోనుంచే.. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నా..

ఇలియానా గతంలో అనేకసార్లు బాడీ షేమింగ్ కి గురయింది. అయితే ఈ బాడీ షేమింగ్ వల్ల తను ఆత్మహత్య చేసుకొవాలి అనుకుంది అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను గతంలో.......

Ileana : 12 ఏళ్ళ వయసులోనుంచే.. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నా..

Ileana

Updated On : April 15, 2022 / 4:01 PM IST

Ileana :  మన స్టార్ సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ పర్సనల్ సమస్యలు, బాధలు, ఆరోగ్య సమస్యలు, వాళ్ళ కష్టాలు ఇంటర్వ్యూల ద్వారో, స్టేజి మీదో చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా గతంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది అని వచ్చిన వార్తలపై ఇటీవల ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చింది. దేవదాసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది.

తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కూడా నిలిచింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేయడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ ఫోటోలు పెడుతూ రచ్చ చేస్తుంది. ఇలియానా బాడీపై గతంలో అనేక ట్రోల్స్ చేశారు. ఇలియానా గతంలో అనేకసార్లు బాడీ షేమింగ్ కి గురయింది. అయితే ఈ బాడీ షేమింగ్ వల్ల తను ఆత్మహత్య చేసుకొవాలి అనుకుంది అన్నట్టు వార్తలు వచ్చాయి.

Ujwal : కేజీఎఫ్ సినిమాని 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో పెట్టిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ అసలు హీరో ఇతనే..

తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలపై స్పందించింది. ఇలియానా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అది నిజమే. కానీ అది బాడీ షేమింగ్‌ వల్ల మాత్రం కాదు. 12 ఏళ్ల వయసునుంచే నాకు శరీరానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ విషయంలో నేను జాగ్రత్తగానే ఉంటూ వచ్చాను. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి నా శరీరాకృతి కారణం కాదు. కొన్ని మీడియాలలో నాపై జరిగిన బాడీ షేమింగ్ వల్ల నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని రాశారు, అది అబద్దం. అప్పట్లో నా పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. అందువల్ల చనిపోవాలనుకున్నాను. కానీ ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటపడటానికి ట్రై చేసి ఆ ఆలోచనల నుంచి కూడా బయటకి వచ్చాను” అని తెలిపింది.