Ranveer Singh : రణవీర్‌కి బట్టలు దానం చేస్తున్న జనాలు..

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో అక్కడి ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు.

Ranveer Singh : రణవీర్‌కి బట్టలు దానం చేస్తున్న జనాలు..

Ranveer

Updated On : July 27, 2022 / 1:38 PM IST

Ranveer Singh :  ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతను మామూలుగానే విచిత్రమైన బట్టలు వేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాడు. కాని ఈ సారి ఏకంగా ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫొటోషూట్ చేయించగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. కొంత మంది రణవీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ ని వ్యతిరేకిస్తుంటే, మరికొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో అక్కడి ప్రజలు వినూత్న నిరసన చేపట్టారు.

RGV : అందుకే రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ చేశాడు.. అదిరిపోయిన ఆర్జీవీ ట్వీట్..

ఇండోర్ లోని ఓ రోడ్డు పక్కన ఓ బాక్స్ ఏర్పాటు చేశారు. ఆ బాక్స్ కి రణవీర్ నగ్నంగా ఉన్న ఫోటోలని అతికించి ఆ బాక్స్ లో అతనికి బట్టలు దానం చేస్తున్నారు. ఆ బాక్స్ పై ఉన్న రణవీర్ ఫొటో మీద అతనికి దుస్తులు దానం చేయాలని రాశారు. దీంతో అక్కడ చాలా మంది ఆ బాక్స్ లో బట్టలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.