Vijay Devarakonda: ఆ స్టార్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. క్యూ చూస్తుంటే లేనట్టే అనిపిస్తోందిగా..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ తరువాత డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Vijay Devarakonda: ఆ స్టార్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. క్యూ చూస్తుంటే లేనట్టే అనిపిస్తోందిగా..?

Is Vijay Devarakonda Movie With Sukumar Shelved

Updated On : April 3, 2023 / 9:39 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా డిజాస్టర్ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలని కసిగా చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Vijay Devarakonda: యంగ్ సెన్సేషన్‌తో రొమాన్స్‌కు రౌడీ స్టార్ రెడీ..?

కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఇప్పటికే పలువురు డైరెక్టర్స్‌తో లాక్ చేసి పెట్టుకుంటున్నాడు. ఈ జాబితాలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నాడు. గతంలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సుకుమార్‌తో విజయ్ దేవరకొండ మూవీ పట్టాలెక్కడం కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ పూర్తయ్యేసరికి మరింత సమయం పడుతుంది. దీంతో విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ ప్రాజెక్టులను యంగ్ డైరెక్టర్స్‌తో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Vijay Devarakonda : టూర్‌కి పంపించిన అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన రౌడీ హీరో..

ఇప్పటికే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా.. పరశురామ్‌తో ఓ సినిమాను ఓకే చేశాడు ఈ హీరో. దీంతో ఈ ఇద్దరు డైరెక్టర్ల సినిమాలను త్వరలోనే స్టార్ట్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నాడట. ఈ లెక్కన ఈ సినిమాలు పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. ఆ తరువాతే సుకుమార్‌తో ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా ఇప్పట్లో రాదని ఫిలింనగర్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.