మహర్షి షూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తిచేసుకున్న మహర్షి..

  • Published By: sekhar ,Published On : April 18, 2019 / 07:38 AM IST
మహర్షి షూటింగ్ పూర్తి

Updated On : April 18, 2019 / 7:38 AM IST

షూటింగ్ పూర్తిచేసుకున్న మహర్షి..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు కలిసి నిర్మిస్తుండగా, అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్‌గా, పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి, రెండు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో మహేష్ మూడు ఢిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది.

కార్పొరేట్ కంపెనీ సీఈఓగా, ప్రపంచలోనే అత్యంత ధనవంతులైన అయిదు మందిలో ఒకడిగా, యూఎస్ నుండి తిరిగొచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని తెలియచెప్పే పలు షేడ్స్ ఉంటాయట మహేష్ క్యారెక్టర్‌లో.. రీసెంట్‌గా మహర్షి షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న మహర్షి మే 9 న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ మహర్షి టీజర్..