కొరటాల, చిరు సినిమాలో అనసూయ!

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 07:27 AM IST
కొరటాల, చిరు సినిమాలో అనసూయ!

Updated On : April 30, 2019 / 7:27 AM IST

జబర్థస్త్ షోలో యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ. నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ఆ తర్వాత ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా  ఎవరు మరిచిపోలేని నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.  

రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను కొరటాల ఆఫర్ చేశారట. ఇంత పెద్ద ప్రాజెక్టులో మంచి రోల్ దక్కడంతో అనసూయ కూడా ఓకే చెప్పేశారని అంటున్నారు. అయితే, అనసూయకు పారితోషికం కూడా గట్టిగానే ఇస్తున్నారని సమాచారం. రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలు రెమ్యునరేషన్‌గా అనసూయ తీసుకోబుతున్నారని ఫిల్మ్ వర్గాల టాక్. ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.