ప్రభాస్ తో ఒక్క సాంగ్…జాక్వలిన్ ఎంత తీసుకుందో తెలుసా?

మరో వారం రోజుల్లో సాహో మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలోని బ్యాడ్ బాయ్ సాంగ్ లో నటించిన జాక్వలిన్ ఫెర్నాండెజ్ రెమ్యూనరేషన్ గురించిన వార్త ఒకటి హాట్ టాపిక్‌గా మారింది.
జాక్వలిన్ ఫెర్నాండెజ్ సాహో మూవీలో ప్రభాస్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. ఆ ఒక్క సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 24 గంటల్లోనే ఈ పాటను కోట్ల మంది వీక్షించారు. దీంతో ప్రపంచంలోనే కేవలం 24 గంటల్లో ఇన్ని కోట్ల మంది వీక్షించిన తొలి పాటగా ‘సాహో.. బ్యాడ్ బాయ్’నిలిచింది.
ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, లాల్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ 30న సాహో విడుదల కానుంది.