Jalsa Special Shows: పోకిరి రికార్డును లేపేసిన జల్సా.. ఏంది సామీ ఈ క్రేజ్?

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పోకిరి’ని 4K వర్షన్‌లో రీమాస్టర్ చేసి స్పెషల్ షోలు నిర్వహించారు అభిమానులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న వస్తుండటంతో పవన్ అభిమానులు కూడా తమ సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ‘జల్సా’ సినిమాకు సంబంధించి 4K వర్షన్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు.

Jalsa Special Shows: పోకిరి రికార్డును లేపేసిన జల్సా.. ఏంది సామీ ఈ క్రేజ్?

Jalsa Special Shows Beat Pokiri Record

Updated On : August 31, 2022 / 12:03 PM IST

Jalsa Special Shows: ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ మూవీ ‘పోకిరి’ని 4K వర్షన్‌లో రీమాస్టర్ చేసి స్పెషల్ షోలు నిర్వహించారు అభిమానులు. ఈ స్పెషల్ షోస్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పోకిరి మూవీని ఒకటి కాదు రెండు కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 380 షోలు వేశారు అభిమానులు. ఈ స్థాయిలో ఓ రీరిలీజ్ సినిమాకు షోలు పడటం సరికొత్త రికార్డు అని మహేష్ అభిమానులు కాలర్ ఎగరేశారు.

Jalsa Movie Re Release : పవన్ ‘జల్సా’ రీ రిలీజ్.. మరోసారి రికార్డుల మోత..

అయితే ఇప్పుడు మహేష్ బాబు పోకిరి రికార్డును లేపేశాడు మరో స్టార్ హీరో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న వస్తుండటంతో పవన్ అభిమానులు కూడా తమ సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ‘జల్సా’ సినిమాకు సంబంధించి 4K వర్షన్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ షోలకు వరల్డ్‌వైడ్‌గా పవన్ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పటికే ఏకంగా 501కి పైగా షోలు వేసేందుకు రెడీ అయ్యారు అభిమానులు. దీంతో ఈ సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Pokiri Re-Release: పోకిరి రీ-రిలీజ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. మహేషా మజాకా!

ఇక ఈ సినిమాకు మరిన్ని షోలు యాడ్ అవుతాయని అభిమానులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇప్పటికే పోకిరి రికార్డును లేపేసిన జల్సా, కలెక్షన్ల పరంగా కూడా పోకిరి రికార్డులను తిరగరాయడం ఖాయమని పవన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జల్సా మూవీ రీరిలీజ్‌లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.