Pawan Kalyan : పవన్ సీరియస్.. థియేటర్ల బంద్ ఇష్యూ.. జనసేన నేత సస్పెండ్.. ఆ బాధ్యతల నుంచి కూడా తొలగింపు..

అతనిపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించి అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ విడుదల చేసింది.

Pawan Kalyan : పవన్ సీరియస్.. థియేటర్ల బంద్ ఇష్యూ.. జనసేన నేత సస్పెండ్.. ఆ బాధ్యతల నుంచి కూడా తొలగింపు..

Janasena Party Suspends Atti Satyanarayana Regarding Theaters Issue

Updated On : May 27, 2025 / 4:22 PM IST

Pawan Kalyan : ఇటీవల నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ జరుగుతుండగా ఆ వివాదం కాస్త పెద్దది అయి ఏపీ ప్రభుత్వం వరకు వెళ్ళింది. థియేటర్స్ బంద్ అని చేయడం, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలోనే ఆ బంద్ ప్లాన్ చేయడం.. ఇవన్నీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరకు వెళ్లడంతో పవన్ సీరియస్ అయ్యారు.

టాలీవుడ్ పై, థియేటర్స్ పై ఫైర్ అయ్యారు పవన్. పవన్ టాలీవుడ్ పై సీరియస్ అవడంతో ఈ ఘటన టాలీవుడ్ లో చర్చగా మారింది. దీంతో ఈ ఘటనపై ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ మీటింగ్స్ పెట్టారు.

Also Read : Sandeep Vanga – Deepika Padukone : సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకోన్.. అసలు సమస్య ఏంటి? సందీప్ ఫైర్.. దీపికని ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు..

అయితే నిన్న దిల్ రాజు మీటింగ్ లో మాట్లాడుతూ.. అసలు ఈ ఇష్యూ అంతా తెరపైకి తెచ్చింది ఓ ఈస్ట్ గోదావరి వ్యక్తి. అతను అందర్నీ కలిపి ఇలా మాట్లాడించాడు. రీసెంట్ గా అతను ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతనే ఈ థియేటర్స్ ఇష్యూని నైజాంకి కూడా తెచ్చాడు అని అన్నారు. అతని పేరు అత్తి సత్యనారాయణ. అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత. అతను జనసేన పార్టీ అని తెలిసింది. అతనిపై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ తీవ్రంగా స్పందించి అతన్ని సస్పెండ్ చేస్తూ లెటర్ విడుదల చేసింది.

జనసేన పార్టీ రిలీజ్ చేసిన లెటర్ లో.. అత్తి సత్యనారాయణ.. అవాంచనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజక వర్గం ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది అని ప్రకటించారు. దీంతో సొంత పార్టీ నేత తప్పు చేసాడని ఆరోపణలు వస్తేనే ఇలా సస్పెండ్ చేయడంపై ఆశ్చర్యపోతూనే పవన్ ని అభినందిస్తున్నారు. ఈ థియేటర్స్ ఇష్యూ ఇంకెక్కడిదాకా వెళ్తుందో.

Also Read : Pushpa : ‘పుష్ప’లో ఫహద్ ఫాజిల్ కోసం ఆ తెలుగు హీరోని అడిగారట.. కానీ..