Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసమే RRR మళ్ళీ చూశాను.. ఆయనతో సినిమా ఛాన్స్ కోసం రోజూ దేవుడికి దండం పెట్టుకున్నాను..

ఎన్టీఆర్ 30 సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేసే అవకాశం రావాలని రోజూ దేవుడ్ని కోరుకునేదాన్ని. ఆయనతో పనిచేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. ఫైనల్ గా...................

Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసమే RRR మళ్ళీ చూశాను.. ఆయనతో సినిమా ఛాన్స్ కోసం రోజూ దేవుడికి దండం పెట్టుకున్నాను..

Janhvi Kapoor eagerly waiting to work with NTR

Updated On : March 20, 2023 / 9:58 AM IST

Janhvi Kapoor :  అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ కి పరిచయమైంది జాన్వీ కపూర్. బాలీవుడ్ భామ జాన్వీ ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా రాలేదు. ఎప్పట్నుంచో జాన్వి సౌత్ లో యాక్ట్ చేయాలని శ్రీదేవి అభిమానులు, సౌత్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. జాన్వీకి సౌత్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో పలు ఇంటర్వ్యూలలో జాన్వీ మాట్లాడుతూ సౌత్ సినిమాల్లో ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను అని తెలిపింది.

ఇటీవలే NTR 30వ సినిమాలో జాన్వీ కపూర్ నటించబోతోంది అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. దీనిపై అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. జాన్వీ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సరసన యాక్టింగ్ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గతంలో జాన్వీ కపూర్ కొన్ని ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ తో ఛాన్స్ రావాలనుకుంటున్నాను, ఎన్టీఆర్ తో కలిసి యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. తాజాగా ఇటీవల నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ ప్రోగ్రాంలో జాన్వీ పాల్గొని మరోసారి ఎన్టీఆర్ తో నటించడంపై మాట్లాడింది.

Kaala Bhairava : RRR నాటు నాటు సింగర్ కాలభైరవ స్పెషల్ సెలబ్రేషన్స్..

ఎన్టీఆర్ 30 సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేసే అవకాశం రావాలని రోజూ దేవుడ్ని కోరుకునేదాన్ని. ఆయనతో పనిచేయాలని ఉందని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. ఫైనల్ గా అది నెరవేరబోతోంది. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా, సెట్ లో ఎప్పుడు అడుగు పెట్టాలా అని వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ కి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని డైలీ మెసేజ్ చేస్తున్నాను. ఇప్పటికే RRR సినిమాని రెండు సార్లు చూశాను. ఇటీవలే మరోసారి ఎన్టీఆర్ కోసం చూశాను. ఆయన చాలా అందంగా, ఎనర్జీగా ఉంటారు అని తెలిపింది. దీంతో జాన్వీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం మార్చ్ 23న జరగనుంది.