Josh Talent Awards : వెనుకబడిపోయిన క‌ళాకారుల‌ను ప్రోత్సహించాల‌నేదే మా సంస్థ ఉద్దేశ్యం

హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో సెప్టెంబ‌ర్ 22న జోష్ టాలెంట్ అవార్డుల కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు విచ్చేశారు.

Josh Talent Awards : వెనుకబడిపోయిన క‌ళాకారుల‌ను ప్రోత్సహించాల‌నేదే మా సంస్థ ఉద్దేశ్యం

Josh Talent Awards

Updated On : September 26, 2023 / 7:03 PM IST

Josh Talent Awards : హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో సెప్టెంబ‌ర్ 22న జోష్ టాలెంట్ అవార్డుల (Josh Talent Awards) కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వెనుకబడిపోయిన కళాకారులను ప్రోత్సహించాలంటే చాలా దైర్యం కావాలన్నారు. అలాంటి ధైర్యం చేస్తున్న సంజోష్ తగరం కి ఎల్లవేళలా త‌న ప్రోత్సాహం ఉంటుందన్నారు.

మరో అతిథిగా విచ్చేసిన ప్రముఖ ప్రొడ్యూసర్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. వెనుకబడిపోయిన కళాకారులను  ఒక అవకాశం కలిపిద్దామని  చేసే ప్రయత్నం చాలా గొప్పదన్నారు. ఇలాంటి ప్రయత్నానికి  తప్పకుండ అన్ని విధాలుగా స‌పోర్ట్ చేస్తామ‌ని కొండేటితో పాటు హీరో కిర‌ణ్‌, తెలంగాణ స్టేట్ కో ఆర్డినేటర్ డి.శ్రీనివాస్ నాయక్ లు తెలిపారు.

లయన్స్ గ్రూప్ చైర్మన్ బెల్లి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. నా మిత్రుడు అయినా సంజోష్ తగరం కళాకారులని ప్రోత్సహించాలని చేసే ప్రయత్నం గొప్ప‌ద‌న్నారు. తనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా తను ఎదుగుతూ నలుగురికి  సపోర్ట్ చేస్తున్న తీరు అద్భుతమ‌ని కొనియాడారు. ఇంత గొప్ప ప్రయత్నం చేస్తున్న నా మిత్రునికి ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు.

Josh Talent Awards

Josh Talent Awards

Sai Dharam Tej – Swathi : కాలేజీ టైంలో స్వాతి పేపర్‌ కాపీ కొట్టి పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..

‘జోష్ ‘ టాలెంట్ అవార్డ్స్ అధినేత సంజోష్ తగరం మాట్లాడుతూ.. ఎంతో మంది కళాకారులు మంచి టాలెంట్ ఉండి కూడ  అవకాశం రాక గుర్తింపు లేక వెనుకబడి పోయారన్నారు. అలాంటి టాలెంట్ ఉన్న కళాకారులను ఒక గుర్తింపు ఇచ్చి మళ్ళీ వాళ్ళకు అవకాశం కలిపించి వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకురావాల‌న్న‌దే ఈ సంస్థ ఉద్దేశ‌మ‌న్నారు. టాలెంట్ ఉన్న కళాకారులను త‌ప్ప‌కుండా ఎంక‌రేజ్ చేస్తాన‌న్నారు. ఈ కార్యక్రమనికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులకు, ఫ్రెండ్స్ శ్రేయాభిలాషులకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.