NTR30 : ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. బర్త్ డేకి గిఫ్ట్ రెడీ!

ఎన్టీఆర్ పుట్టినరోజుకి కళ్యాణ్ రామ్ అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు..

NTR30 : ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. బర్త్ డేకి గిఫ్ట్ రెడీ!

Kalyan Ram brings NTR30 first look on NTR birthday

Updated On : May 17, 2023 / 7:56 PM IST

NTR30 First Look : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న మూవీ NTR30. RRR తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా కనిపించబోతున్నాడు.

NTR 100 Years : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై ముదురుతున్న వివాదం.. కరాటే కళ్యాణితో తలసాని భేటీ, మంచు విష్ణు నోటీసులు!

ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు NTR30 కి సంబంధించిన అప్డేట్ ఏదోకటి వస్తుందని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ అదిరిపోయే న్యూస్ చెప్పాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19న ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాని తెలియజేస్తూ షేర్ చేసిన పోస్టర్ అండ్ స్టేట్‌మెంట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘రక్తంతో రాసిన ఎన్నో కథలకు సముద్రమే సాక్షి’ అంటూ కామెంట్ చేశారు.

NTR : ఎట్టకేలకి ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగం కాబోతున్న జూనియర్..

ఇక ఈ అప్డేట్ తో అభిమానులు ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. కాగా ఈ మూవీ టైటిల్ కి సంబంధించిన ఒక పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకి ‘దేవర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. మరి టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇటీవలే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. త్వరలో కొత్త షెడ్యూల్ ని ప్రారభించనున్నారట. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని సమాచారం. ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తుంది.