Devil : ‘డెవిల్’ ఈజ్ కమింగ్.. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ అనౌన్స్..
ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.

Kalyan Ram Devil Movie Releasing date announced by movie unit
Kalyan Ram Devil : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార(Bimbisara) సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బింబిసార సినిమా తర్వాత వరుస సినిమాలని లైన్ లో పెట్టారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాతో రాబోతున్నారు. సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా, నవీన్ అనే కొత్త దర్శకుడు అభిషేక్ నామా నిర్మాతగా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో డెవిల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా బ్రిటిష్ కాలంలో ఉండే సీక్రెట్ ఏజెంట్ కథ అని తెలుస్తుంది. స్వాతంత్య్రం ముందు పీరియాడిక్ కథతో రాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
Prabhas : ప్రభాస్ మళ్ళీ మారుతి సినిమా షూట్ మొదలుపెట్టనున్నాడా?.. మారుతి – ప్రభాస్ బ్యాక్ టు షూట్..
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాని నంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. డెవిల్ డీకోడింగ్ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ డెవిల్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Unlock the door to mystery with #Devil on November 24th!
The British secret agent will take you on a journey through the shadows of history @NANDAMURIKALYAN@iamsamyuktha_
A Film by ABHISHEK PICTURES @NaveenMedaram @soundar16 @SrikanthVissa @rameemusic @vasupotini… pic.twitter.com/XSRkzhplh1
— ABHISHEK PICTURES (@AbhishekPicture) August 6, 2023