Thug Life : ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికే ‘థగ్ లైఫ్’.. కమల్‌హాసన్
కమల్ హాసన్ నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది

Thug Life Pre Release Event
కమల్ హాసన్ నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష కథానాయికగా నటిస్తోంది. శింబు, అభిరామి, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. వైజాగ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. తన 21 ఏళ్ల వయసులో వైజాగ్ వచ్చానని అన్నారు. అప్పుడు తన గురించి ఎవ్వరికి తెలియదన్నారు. దీంతో చిత్ర షూటింగ్ సాఫీగా సాగిందన్నారు. మూవీ రిలీజ్ అయిన తరువాత ఎక్కడ కూడా నడవలేని ఫ్యాన్ బేస్‌ని మరో చరిత్ర ఇచ్చిందన్నారు. వైజాగ్ తనకు సొంత ఇల్లు లాంటిది అని చెప్పుకొచ్చారు.
Hari Hara VeeraMallu : ‘హరి హర వీరమల్లు’ నిర్మాతకు అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు..
తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకోవడం కోసమే థగ్ లైఫ్‌తో వస్తున్నాం. ఇది అద్భుమైన మూవీ. శింబు, అభిరామి, త్రిష, నాజర్‌లు చాలా బాగా నటించారు. జూన్ 5న థియేటర్లలో కలుద్దాం అని కమల్ హాసన్ అన్నారు.
మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని శింబు అన్నారు. ‘థగ్‌లైఫ్’ మూవీ కూడా తప్పకుండా అందరికి నచ్చుతుందన్నారు.