Emergency : సంక్రాంతి బరిలో కంగనా ‘ఎమెర్జెన్సీ’.. రిలీజ్ డేట్ అనౌన్స్..
కంగనా రనౌత్ తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

Kangana Ranaut Emergency Movie Release Date Announced
Emergency : సంక్రాంతి బరిలో మన టాలీవుడ్ లో ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా సంక్రాంతి సినిమాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ తన నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన సినిమాలతో పాటు తన వ్యాఖ్యలతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ఎన్నికల్లో మండీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా ఎన్నికైంది కంగనా.
Also Read : Pushpa 2 : పుష్ప 2 ట్రైలర్.. ఆ రికార్డు సాధించిన ఫస్ట్ సౌత్ మూవీ..
ఇందిరాగాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీపై కంగనా సినిమా నిర్మించింది. ఈ సినిమాలో కంగనానే ఇందిరాగాంధీ పాత్ర పోషించడమే కాకుండా ఆమె ఈ సినిమాని నిర్మాతగా, దర్శకురాలిగా తెరకెక్కించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా సెన్సార్ ఇబ్బందులు, ఎన్నికల వల్ల, పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది. గతంలో ఈ సినిమా గ్లింప్స్, ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా కంగనా రనౌత్ తన ఎమర్జెన్సీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఎమర్జెన్సీ సినిమా 2025 జనవరి 17న రిలీజ్ కానున్నట్టు ప్రకటించింది కంగనా.
దీంతో సంక్రాంతి అయ్యిన వెంటనే ఆ బరిలో కంగనా ఎమర్జెన్సీ సినిమా కూడా నిలవనుంది. మరి ఈసారన్నా చెప్పిన డేట్ కి ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుందా లేదా చూడాలి.