Kangana Ranaut : ఎమర్జెన్సీ ఫైనల్ ఎడిటింగ్ పూర్తి.. ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదట ఎవరికి చూపించిందో తెలుసా?

కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా ఫైనల్ ఎడిటింగ్ అవుట్ పుట్ రెడీ అయ్యింది. ఆ అవుట్‌పుట్ ని టాలీవుడ్ స్టార్..

Kangana Ranaut : ఎమర్జెన్సీ ఫైనల్ ఎడిటింగ్ పూర్తి.. ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదట ఎవరికి చూపించిందో తెలుసా?

Kangana Ranaut show her Emergency movie to RRR writer Vijayendra Prasad first

Updated On : May 18, 2023 / 2:45 PM IST

Kangana Ranaut Emergency : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ (Emergency) అనే సినిమాని తెరకెక్కిస్తుంది. 1977 లో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కంగనానే కథని అందిస్తూ దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇక సొసైటీలో జరిగే కొన్ని సంఘటనల గురించి ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం కాంట్రవర్సీలలో నిలిచే కంగనా.. ఎమర్జెన్సీ వంటి సెన్సిటివ్ మ్యాటర్ ని ఎలా చూపించబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది.

Chandramukhi 2 : దాదాపు 22 ఏళ్ళ తరువాత కీరవాణి తమిళ్ ఎంట్రీ.. చంద్రముఖి 2 షూటింగ్ చివరి దశలో..

ఈ సినిమా కోసం కంగనా చాలా కష్ట పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫైనల్ ఎడిటింగ్ అవుట్ పుట్ రెడీ అయ్యిపోయిందట. అయితే ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదట ఎవరికి చూపించిందో తెలుసా?? టాలీవుడ్ స్టార్ రైటర్ రైటర్ అయిన వి విజయేంద్ర ప్రసాద్ కి (V Vijayendra Prasad) చూపించిదట. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ సినిమా చూస్తునంతసేపు విజయేంద్ర ప్రసాద్ చాలాసార్లు కళ్ళు తుడుచుకున్నారట. సినిమా మొత్తం చూశాక.. “నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి” అంటూ ప్రశంసించారని చెప్పుకొచ్చింది. ఆ మాటలు నా జీవితంలో మర్చిపోలేనని పేర్కొంది.

Kangana Ranaut : దేశ వ్యతిరేకుల గురించి మాట్లాడినందుకు.. సంవత్సరానికి 40 కోట్లు నష్టపోతున్నాను.. అయినా సరే..

కాగా త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామంటూ కంగనా చెప్పుకొచ్చింది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమ చౌదరి, మిలింద్ సోమన్, సుమిత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాని కేవలం హిందీలోనే రిలీజ్ చేస్తారా? లేదా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తారా? అన్న దాని పై క్లారిటీ లేదు.

Kangana Ranaut show her Emergency movie to RRR writer Vijayendra Prasad first

Kangana Ranaut show her Emergency movie to RRR writer Vijayendra Prasad first