Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది.. కన్నడ స్టార్ హీరో కామెంట్స్..
పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలని ఉంది అంటూ కన్నడ స్టార్ హీరో చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kannada hero Rakshit Shetty comments on Pawan Kalyan
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని చాలామందికి ఉంటుంది. ఇక పలువురు హీరోలు సైతం పవన్ సినిమాల్లో జస్ట్ గెస్ట్ రోల్ లో కనిపించడానికి కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఒక కన్నడ స్టార్ హీరోని.. ‘మీరు ఏ తెలుగు హీరోతో కలిసి నటించాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు. దానికి ఆ హీరో అసలు ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పేశాడు. పవన్ కి ఒక ప్రత్యేక స్టైల్ ఉంటుందని, అది ఎవరు మ్యాచ్ చేయలేరని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ శాండిల్ వుడ్ హీరో ఎవరు..?
South Heroine : ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఇలా అయ్యిపోయింది ఏంటంటూ..!
ఇటీవల ‘777 చార్లీ’ సినిమాతో తెలుగు వారికీ దగ్గరైన కన్నడ స్టార్ ‘రక్షిత్ శెట్టి’. ఆ మూవీతో ఇక్కడ మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేశాడు. ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) అనే ఒక మధురమైన ప్రేమకథతో నేడు సెప్టెంబర్ 22న తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రక్షిత్ శెట్టిని.. తెలుగులో ఎవరితో కలిసి నటించాలని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు.. పవన్ అని చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dhanush51 : ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. ఏ ఆర్ రెహమాన్‌కి బయపడి..
Kannada actor Rakshit shetty wants to act alongside @PawanKalyan. pic.twitter.com/8amOD0jPG1
— Pawanfied (@Only_PSPK) September 22, 2023
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. అయితే ఇంతలోనే ఏపీలో పాలిటిక్స్ హీటెక్కడంతో పవన్ అటు వెళ్ళాడు. దీంతో ఈ మూవీకి మల్లి బ్రేక్ లు పడ్డాయి. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలయ్యి, ఎప్పుడు పూర్తి అయ్యి, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.