Kantara Chapter 1 : బాయ్ కాట్ అన్నా.. విమర్శలు చేసినా.. మళ్ళీ తెలుగు వాళ్ళను టార్గెట్ చేసిన కాంతార చాప్టర్ 1..

ఇంత జరిగినా నిన్న రిషబ్ శెట్టి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి పూర్తిగా కన్నడలో మాట్లాడాడు. (Kantara Chapter 1)

Kantara Chapter 1 : బాయ్ కాట్ అన్నా.. విమర్శలు చేసినా.. మళ్ళీ తెలుగు వాళ్ళను టార్గెట్ చేసిన కాంతార చాప్టర్ 1..

Kantara Chapter 1

Updated On : September 29, 2025 / 8:19 PM IST

Kantara Chapter 1 : ఇటీవల కర్ణాటకలో వరుసగా తెలుగు సినిమాల రిలీజ్ సమయంలో కన్నడ వాళ్ళు గొడవలు చేసిన సంగతి తెల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2, హరిహర వీరమల్లు.. ఇలా చాలా సినిమాలకు తెలుగులో టైటిల్స్ లేవని, ఇక్కడ తెలుగు సినిమాలు ఆడొద్దని గొడవలు చేశారు. రీసెంట్ గా OG సినిమాకు కూడా కన్నడ వాళ్ళు గొడవలు చేయడంతో తెలుగు సినిమా లవర్స్ బాగా హర్ట్ అయ్యారు.(Kantara Chapter 1)

మన తెలుగు వాళ్ళు అన్ని పరిశ్రమల సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇటీవల వచ్చిన కన్నడ సినిమాలన్నీ ఇక్కడ హిట్ చేసాం, అయినా మన సినిమాలని కనీసం ఆడనివ్వట్లేదు అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో అక్టోబర్ 2న రిలీజ్ అయ్యే కాంతార చాప్టర్ 1 సినిమాని బ్యాన్ చేయాలి తెలుగులో అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇంత జరిగినా నిన్న రిషబ్ శెట్టి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి పూర్తిగా కన్నడలో మాట్లాడాడు. ఇంకేముంది అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.

Also Read : Tik Tok Bhanu : టిక్ టాక్ భాను లవ్ స్టోరీ.. పదేళ్లు లవ్.. ఫస్ట్ అన్నయ్య అని పిలిచి.. పెళ్లి ఎప్పుడంటే..?

సింగర్ మంగ్లీని కర్ణాటకలో తెలుగు పాటలు పాడితే దాడి చేసిన సంగతి తెలిసిందే. దాన్ని గుర్తుచేస్తూ మీరు అలా దాడులు చేస్తారు, మీరు మాత్రం ఇక్కడకు వచ్చి కన్నడలో మాట్లాడతారు అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లడంతో ఒకప్పుడు హరికృష్ణ పార్లమెంట్ లో తెలుగు భాష గురించి పోరాటం చేసిన వీడియోలు బయటకు తీసి ఎన్టీఆర్ ని కూడా విమర్శిస్తున్నారు. ముంబై హీరోయిన్స్ అయినా నయం వచ్చి రాని తెలుగులో మాట్లాడతారు, రిషబ్ కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అని కామెంట్స్ చేశారు.

ఇప్పటికే ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు ఇంకా పెద్దది అయింది. అందుకు కారణం టికెట్ రేట్స్. అమెరికాలో కాంతార బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయితే హిందీ డబ్బింగ్ వర్షన్ కి టికెట్ 10 డాలర్లు ఉండగా, తెలుగు డబ్బింగ్ వర్షన్ కి 20 డాలర్లు ఉంది. దీంతో అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఫైర్ అవుతున్నారు. అసలే డబ్బింగ్ సినిమా, మళ్ళీ వేరే భాషకి పెంచకుండా తెలుగులో పెంచడం ఏంటని, తెలుగు వాళ్ళు అన్ని సినిమాలని ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని దోచుకుంటున్నారని తెలుగు సినిమా లవర్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో మళ్ళీ బాయ్ కాట్ కాంతార అంటున్నారు.

Also See : Rashmika Mandanna : ‘థామా’ తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నలుపు చీరలో మెరిసిన రష్మిక మందన్న..

ఇంత జరుగుతున్నా కాంతార మూవీ యూనిట్ స్పందించకపోవడం గమనార్హం. మరి తెలుగులో ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.