Kiara Advani: చరణ్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వసుమతి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో....

Kiara Advani: చరణ్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వసుమతి!

Kiara Advani Lands In Hyderabad For Rc15

Updated On : July 12, 2022 / 9:57 PM IST

Kiara Advani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తన నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుకోబోతుంది.

Kiara Advani: నలుపు చీరలో కియారా.. ఫిదా అవ్వకుండా ఉంటారా!

ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాడు హీరో రామ్ చరణ్. కాగా, తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అందాల భామ కియారా అద్వానీ కూడా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కియారా పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Kiara Advani : రిలేషన్‌షిప్‌ లో ఎలా ఉండాలో చెప్తున్న కియారా అద్వానీ..

ఈ సినిమాలో భారీ తారాగణం ఉండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. జూలై 13 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.