Kiara Advani: ఇండస్ట్రీలో ఉండాలంటే ఏం చేయాలో చెప్పిన కియారా!
అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయిన కియారా సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే.. ఉండాల్సిన లక్షణాలేంటో క్లియర్ గా చెబుతోంది. వారానికోసారి..
Kiara Advani: అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయిన కియారా సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే.. ఉండాల్సిన లక్షణాలేంటో క్లియర్ గా చెబుతోంది. వారానికో సారి జాతకాలు మారే ఈ మాయా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలని చెప్తుంది కియారా.
Aditi Rao Hydari: అదితి ఆశలు.. ఈసారి హిట్టు కొడతానంటున్న హైదరాబాదీ!
బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మినిమం 100కోట్ల హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కియారా షేర్ షా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. స్టార్ హీరోల క్రేజీ ఆఫర్లతో కెరీర్ లో బిజీ అయిపోతూ ఇప్పటికే చేతినిండా సినిమాలతో డేట్స్ లేవని చెబుతున్న ఈ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే తోలు మందంగానే ఉండాలని చెబుతోంది.
Aha: దసరా టూ సంక్రాంతి.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ పండగే!
చేతిలో సినిమాలు.. సక్సెస్ లు ఉన్నాయి కదాని ఎక్కడా రిలాక్స్ అవ్వకుండా ఎప్పుడూ న్యూస్ లో ఉంటోంది కియారా. లేటెస్ట్ గా సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా తోలు మందం అయి ఉండాలంటోంది. ఎందుకంటే.. లైమ్ లైట్లో ఉన్నప్పుడు మనం చేసే ప్రతీ దాని గురించి కామెంట్ చేస్తుంటారు జనాలు. సో.. అవన్నీ పట్టించుకోకుండా ఉండాలంటే వినీ విననట్టు వదిలెయ్యాలంటోంది కియారా.
Big Boss 5: లోబో పొట్టపై సెటైర్లు.. యానీ మాస్టర్ ఉగ్రరూపం!
వారం వారం జాతకాలు మారిపోయే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నెగెటివిటీని అస్సలు దగ్గరకి కూడా రానివ్వకూడదంటోంది కియారా. ఒక వేళ నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకుంటే.. కెరీర్ దెబ్బతినే ఛాన్స్ ఉందంటోంది ఈ స్మార్ట్ హీరోయిన్. అందుకే వినీ విననట్టుగా తోలు మందంగా ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం అంటూ కెరీర్ సీక్రెట్స్ చెబుతోంది ఈ సక్సెస్ ఫుల్ హీరోయిన్.