Indraja Sankar : పండంటి బాబుకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్..

తాజాగా నటి ఇంద్రజ తల్లి అయింది.

Indraja Sankar : పండంటి బాబుకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్..

Lady Comedian Indraja Shankar Blessed with Baby Boy

Updated On : January 21, 2025 / 11:01 AM IST

Indraja Sankar : తమిళ్ లో పలు సినిమాల్లో కమెడియన్ గా, ఫ్రెండ్ పాత్రల్లో నటించిన ఇంద్రజ గత సంవత్సరం డైరెక్టర్ కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఇంద్రజ తల్లి అయింది. తనకు బాబు పుట్టాడని తన సోషల్ మీడియాలో తెలిపింది. తన భర్త కార్తీక్ చెయ్యి, తన చెయ్యితో పాటు పుట్టిన బాబు చెయ్యిని కూడా తీసుకొని తీసిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. తనకు అబ్బాయి పుట్టాడు అని తెలిపింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Kiran Abbavaram – Rahasya Gorak : తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. తన భార్య ప్రగ్నెంట్ అంటూ ఫొటో షేర్ చేసి..

తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ. తమిళ్ లో విజయ్ బిగిల్ సినిమాతో నటిగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పాగల్, విరుమాన్.. లాంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పలు టీవీ షోలు కూడా చేసింది. తన ఫ్యామిలీకి సన్నిహితుడైన డైరెక్టర్ కార్తీక్ ని గత సంవత్సరం వివాహం చేసుకుంది. ఓ షో చేస్తున్నప్పుడే తాను ప్రగ్నెంట్ అని ప్రకటించి షో నుంచి తప్పుకుంది. ప్రగ్నెంట్ అయ్యాక కూడా పలు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది ఇంద్రజ. ఈమె శ్రీమంతం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇంద్రజ పండంటి బాబుకి జన్మనించ్చింది.

 

Also Read : Dil Raju : ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్.. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాతల ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..