Raj Tharun – Lavanya : రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలన ఫిర్యాదు..
ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్విపై కేసు పెట్టిన లావణ్య తాజాగా మరోసారి రాజ్ తరుణ్, మాల్వీలపై కేసు పెట్టింది.

Lavanya Case Filed again on Raj Tharun and Malvi Malhotra with Sensational Comments and Proofs
Raj Tharun – Lavanya : గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తాడు. హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. అప్పట్నుంచి లావణ్య రోజూ రాజ్ తరుణ్ పై ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి రాజ్ తరుణ్ గురించి, రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా రిలేషన్ గురించి చెప్పి తన కోసం నన్ను వదిలేసాడని, మాల్వి నన్ను బెదిరిస్తుందని ఆరోపణలు చేసింది.
ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్విపై కేసు పెట్టిన లావణ్య తాజాగా మరోసారి రాజ్ తరుణ్, మాల్వీలపై కేసు పెట్టింది. లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ ఫిర్యాదులో.. హీరో రాజ్ తరుణ్‌తో నాకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. పదేళ్లుగా మేము కాపురం చేస్తున్నాం. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు. లావణ్య అలియాస్ అన్విక పేరుతో కలిసున్నాం. అన్విక పేరుతో విదేశాలకు కూడా ఇద్దరం కలిసే వెళ్లాం. మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడు. మాల్వీ కోసం రాజ్‌తరుణ్ ముంబైకు వెళ్లడంతో నేను ప్రశ్నించాను. అప్పట్నుంచి రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడు అని తెలిపింది లావణ్య.
ఈ ఫిర్యాదుతో పాటు కొన్ని స్క్రీన్ షాట్ లు, మరికొన్ని ఆధారాలను, అబార్షన్ చేయించిన మెడికల్ డాక్యుమెంట్స్, ఆస్పత్రి వివరాలు కూడా లావణ్య పోలీసులకు సమర్పించింది. అయితే మరో వైపు లావణ్య పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా తనపై తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కేసు పెట్టింది.
అయితే ఇప్పటివరకు వీటిపై రాజ్ తరుణ్ ఒకేఒక్కసారి స్పందించి లావణ్య చేసేవన్ని తప్పుడు ఆరోపణలు, ఆమెతో రిలేషన్ లో ఉన్నాను కాని ఆమె డ్రగ్స్ కి అలవాటు అయి, వేరే రిలేషన్స్ లో ఉండటంతో చెప్పినా వినకపోవడంతో రిలేషన్ నుంచి బయటకు వచ్చాను అని తెలిపాడు. తాజాగా లావణ్యకు సంబంధించిన ఓ కాల్ రికార్డింగ్ కూడా వైరల్ అవుతుంది.