Bigg Boss 5 : చెత్తలో ఫుడ్ తినేందుకు ట్రై చేసిన లోబో..బిగ్ బాస్‌లో ఆకలి మంటలు
బిగ్ బాస్ లో ఆకలి మంటలు చెలరేగాయి. ఆకలికి కొంతమంది కంటెస్టంట్స్ తట్టుకోలేకపోయారు. సీక్రెట్ గా ఆహారం తీసుకున్నారు.

Bigboos Telugu
Lobo Very Hurting : బిగ్ బాస్ లో ఆకలి మంటలు చెలరేగాయి. ఆకలికి కొంతమంది కంటెస్టంట్స్ తట్టుకోలేకపోయారు. సీక్రెట్ గా ఆహారం తీసుకున్నారు. ఇంటి సభ్యుల ఆకలి సహనాన్ని పరీక్షించడానికి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్లందరికీ మటన్ బిర్యానీ పంపారు. కొన్ని జంటలు బిర్యానీ లాగించేయగా…నటరాజ్ మాస్టర్ తినకుండా ఒంటరి పోరాటం చేశాడు. మాస్టర్ టీంలో ఉన్న లోబో మాత్రం ఆకలికి తట్టుకోలేక..చెత్త కవర్లో దాచిపెట్టిన ఆహారాన్ని తీసుకోవడానికి ట్రై చేశాడు. ఎవరికంట కనబడకుండా ఫుడ్ తినేందుకు లోబో ప్రయత్నించడం..దీనిని మాస్టర్ చూసి..ఆకలి వేస్తే..తినేయ్..నేను వదిలేస్తున్నా..అంటూ…చెప్పాడు.
Read More : BiggBoss 5 : తనని నా గర్ల్ ఫ్రెండ్ చేయాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్..
బుల్లితెరపై ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ 5 రియాల్టీ షో కొనసాగుతోంది. బిగ్ బాస్ పలు టాస్క్ లు ఇస్తున్నాడు. వీటిలో పాల్గొని విన్ కావాలని కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా…ఏమి తినకుండా ఉండాలనే టాస్క్ విధించాడు. హౌస్ లో ఉన్న వారికి ఆకలి మంట ఏంటో తెలియచేశాడు. ఇప్పటికే సభ్యులంతా ఇద్దరిద్దరు జంటలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. రవి – విశ్వ, సన్నీ – మానస్, లోబో- నటరాజ్, శ్వేతా-ఆనీ మాస్టర్, కాజల్-జెస్సీ, రామ్ -హమీదా, షణ్ముఖ్- సిరి, ప్రియ- ప్రియాంక..మొత్తం ఎనిమిది జంటలుగా విడిపోయి టాస్క్ ఆడుతున్నారు. ఆకలికి కొంతమంది తట్టుకోలేకపోయారు. లోబో మాడిపోయాడు.
Read More : BiggBoss 5 : నోటి దగ్గర కూడు లాగేసుకున్న బిగ్ బాస్..
అన్నం పడేస్తే..గుద్దుతా అంటూ లోబో చెప్పాడు. నటరాజ్ మాస్టర్, యాంకర్ రవి, విశ్వ, లోబో, ప్రియలు ఏమోషనల్ గా టాస్క్ చేశారు. ఆకలి రాజ్యం స్పూఫ్ తో వావ్ అనిపించారు. ఎవరూ ఆహారం తీసుకోవద్దని చెప్పినా…సన్నీ సీక్రెట్ గా ఆహారం తీసుకున్నాడు. కెప్టెన్ గా ఉన్న జెస్సీ విఫలం అయ్యాడని బిగ్ బాస్ తెలియచేశారు. సన్నీ – మానస్ లకు పవర్ రూం యాక్సెస్ లభించడంతో నటరాజ్ మాస్టర్ – లోబోలను పోటీదారులగా ఎంచుకున్నారు. బిగ్ బాస్ ఇంటి సభ్యుల ఆకలి సహనాన్ని పరీక్షించడానికి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ మటన్ బిర్యానీ పంపారు. సిరి – షణ్ముఖ్, మానస్ – సన్నీ, శ్రీరామ్ – హమీదా ఈ మూడు జంటలు తప్ప మిగిలిన వాళ్లంతా..బిర్యానీ లాగించారు.