Kaagitham Padavalu : ‘కాగితం పడవలు’ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్.. లవ్ స్టోరీ.. పోస్టర్ భలే ఉందే..
తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

Kaagitham Padavalu
Kaagitham Padavalu : ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో బ్యూటీఫుల్ లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. గ్లింప్స్ లో.. చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి అని అబ్బాయి అంటే.. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్ అని అమ్మాయి చెప్పే డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. పోస్టర్ లో కూడా అమ్మాయి చెప్పు ఒకటి, తెగిపోయిన అబ్బాయి చూపు ఒకటి ఉన్నాయి.
Also Read : Upasana : రామ్ చరణ్ కి ఉపాసన పెట్టిన లవ్ టెస్ట్ ఇదే అంట.. డేటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి తీసుకెళ్లమని..
ఈ గ్లింప్స్ తో సినిమాలోని లవ్ స్టోరీపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.