Maharshi Guruswamy: మహేష్ బాబు ‘మహర్షి’ తాత.. ఇకలేరు!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో భుజాన నాగలి వేసుకుని పొలం పనులకు వెళ్లే ఓ ముసలి రైతు అందరికీ గుర్తుండే ఉంటాడు. మహేష్ బాబు తనకు వ్యవసాయం నేర్పుతావా అని అడిగినప్పుడు.. ‘‘ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే.. ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.. రా..’’ అని ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది.

actor maharshi guruswamy no more
Maharshi Guruswamy: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రంలో భుజాన నాగలి వేసుకుని పొలం పనులకు వెళ్లే ఓ ముసలి రైతు అందరికీ గుర్తుండే ఉంటాడు. మహేష్ బాబు తనకు వ్యవసాయం నేర్పుతావా అని అడిగినప్పుడు.. ‘‘ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే.. ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.. రా..’’ అని ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఆ పాత్ర చేసింది నటుడు గురుస్వామి. మహర్షి సినిమాలో పాత్రతో మంచి గుర్తింపును తెచ్చుకుని మహర్షి గురుస్వామిగా అందరికీ గుర్తుండిపోయారు.
మహర్షి కాన్సెప్ట్ ఇదే.. నమ్రతా ఫొటోలతో చెప్పేసింది
అయితే మహర్షి సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గురుస్వామి, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి నాటక రంగంపై ఇష్టంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేశారు. అటుపై పలు నాటకాల్లో ఆయన నటించారు. కాగా, ఆయుష్మాన్ భవ అనే షార్ట్ ఫిలింలో ఆయన పర్ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది.
ఆ షార్ట్ ఫిలిం చూసే మహర్షి సినిమాలో ఆయన్ను సెలెక్ట్ చేశారు చిత్ర మేకర్స్. మహేష్ బాబుకు వ్యవసాయం నేర్పించే పాత్ర తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆ సినిమా రిలీజ్ సమయంలో తెలిపారు. అయితే ఈ మహర్షి నటుడు మృతి చెందిన విషయం తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.