Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డ్.. ‘సలార్’ని దాటేసి.. ఆ మల్టీప్లెక్స్‌లో..

గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం స్క్రీన్స్ ఈ సినిమాకే కేటాయించబోతున్నారు.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డ్.. ‘సలార్’ని దాటేసి.. ఆ మల్టీప్లెక్స్‌లో..

Mahesh Babu Guntur Kaaram Movie Creates new Record in Prasads Multiplex at Hyderabad

Updated On : January 10, 2024 / 8:25 AM IST

Guntur Kaaram Records :  మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఇక గుంటూరు కారం సినిమాని భారీగా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం స్క్రీన్స్ ఈ సినిమాకే కేటాయించబోతున్నారు. అయితే హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో సినిమా అంటే అందరికి ముందు గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమ్యాక్స్(Prasads Multiplex). ఏ సినిమా రిలీజయినా మొదటి రోజు పొద్దున్నే థియేటర్ బయట భారీ హడావిడి కనిపిస్తుంది. రివ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్, మీడియా కూడా ఇక్కడికే వస్తారు. చాలామంది హైదరాబాద్ వాసులు మల్టీప్లెక్స్ లో రిలీజ్ రోజు సినిమాలు చూడాలనుకుంటే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కే వస్తారు.

Also Read : Guntur Kaaram : బాబుతో పాటు అంతా స్పెషల్ ఫ్లైట్‌లోనే.. గుంటూరుకి ఘాటు ఎక్కించి..

ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో 6 స్క్రీన్స్ ఉండగా రిలీజ్ రోజు ఆల్మోస్ట్ పెద్ద సినిమా ఉంటే అన్ని స్క్రీన్స్ ఇచ్చేస్తారు. ఇక గవర్నమెంట్ నుంచి ఎక్స్‌ట్రా షోలకి పర్మిషన్ వస్తే తెల్లవారు జామున నుంచి అర్ధరాత్రి వరకు షోలు నడుస్తాయి. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఇటీవల సలార్ సినిమా రిలీజ్ రోజు 37 షోలు పడి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ గుంటూరు కారం కొట్టేసింది. గుంటూరు కారం సినిమా రిలీజ్ రోజు ఏకంగా 41 షోలు వేయనున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అధికారికంగా ప్రకటించింది. గుంటూరు కారం సినిమాకి అర్ధరాత్రి నుంచే ఎక్స్‌ట్రా షోలకు పర్మిషన్ రావడంతో ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని షోలు గుంటూరు కారం సినిమాకే కేటాయించారు. దీంతో హైదరాబాద్ ఒక్క ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనే రికార్డ్ సెట్ చేస్తుంటే ఓవరాల్ గా మొదటి రోజు ఎక్కువ షోలు, ఎక్కువ థియేటర్స్, భారీ కలెక్షన్స్ తో బాబు బాక్సాఫీస్ బద్దలుకొడతాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.