Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవ్వదా? మహేశ్ అభిమానుల్లో నిరాశ..

ఈ మూవీకి ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి. కానీ 2024 సంక్రాంతికి రిలీజంటూ మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుతుందో లేదో అనేది సందేహంగా మారింది.

Guntur Kaaram : గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ అవ్వదా? మహేశ్ అభిమానుల్లో నిరాశ..

Mahesh Babu Guntur Kaaram Movie may be not releasing on Sankranthi Fans Disappointing

Updated On : June 22, 2023 / 9:55 AM IST

Mahesh Babu : అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లోని మూడో సినిమా అవడం వల్ల ‘గుంటూరు కారం’ సినిమాకి మామూలు క్రేజ్ లేదు. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి. కానీ 2024 సంక్రాంతికి రిలీజంటూ మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుతుందో లేదో అనేది సందేహంగా మారింది.

2021 మేలో ‘గుంటూరు కారం’ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. 2022 జనవరి లో మహేశ్ బాబుకు జర్మనీలో స్టోరీ చెప్పాడు త్రివిక్రమ్. 2022 ఫిబ్రవరి 3న రామానాయుడు స్టూడియోస్ లో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముందుగా సినిమాటోగ్రాఫర్ గా ఆర్ మదిని ఫిక్స్ చేశారు. అయితే ఆ తర్వాత అతడి ప్లేస్ లోకి పి.యస్ వినోద్ వచ్చాడు. అలాగే ఫైట్ మాస్టర్స్ గా ముందుగా అన్బు, అరివు అనే తమిళ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకున్నారు. 2022 సెప్టెంబర్ 12న ఈ ఇద్దరి ఆధ్వర్యంలో భారీ ఫైట్ సీక్వెన్స్ తో ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ అయింది. కానీ ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి వారి ప్లేస్ లోకి రామలక్ష్మణులు వచ్చి చేరారు. ఈ ఇద్దరూ ఈ ఏడాది జనవరిలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు.

షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మహేశ్ ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని లాస్ట్ ఇయర్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే మహేశ్ తండ్రి కృష్ణ మరణంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయిపొయింది. తరువాత ఆగష్టు 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే జనవరి నుంచి మహేశ్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ కి రెడీ కాలేదు. దాంతో పాటు క్యాస్టింగ్ కూడా సెట్టవలేదు. అందుకే ఏడాది సంక్రాంతికి రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. ఈ మార్చ్ తో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో మూడో షెడ్యూల్ ఇంత వరకూ స్టార్ట్ కాలేదు. ఈ జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Ajith – Siva : ఆ స్టార్ హీరో – డైరెక్టర్ కాంబో ఇప్పటికే నాలుగు హిట్లు.. ఇప్పుడు ఐదోసారి రిపీట్..

ఇలా ఏవో కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతుంటే ఇవి చాల్లేదన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను తప్పించారని, హీరోయిన్ గా పూజా హెగ్డేను మార్చేశారని ఏవేవో వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే తమన్ విషయంలో అది గాసిప్ అని తెలిపోయినా పూజా హెగ్డే మాత్రం సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. శ్రీలీల ఒక హీరోయిన్ గా ఉండగా ఇప్పుడు ఇంకో హీరోయిన్ గా సంయుక్త మీనన్ వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలవ్వలేదు. ఇంకా కాస్టింగ్ చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి వాటి మధ్య సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై మహేశ్ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆ సినిమా చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ రాజమౌళితో సినిమా అయితే కనీసం మూడు, నాలుగేళ్లు మహేశ్ నుంచి సినిమా రాదనీ అభిమానులు భావిస్తున్నారు.