Mahesh babu : మహేష్ బాబు బ్రేక్ ఫాస్ట్ ఏం తింటాడో తెలుసా? తన న్యూట్రిషనిస్ట్ గురించి బయటపెట్టిన మహేష్..

మహేష్ అంత అందంగా, అంత ఫిట్ గా ఎలా ఉంటాడు అని అభిమానులతో పాటు అందరూ సందేహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. అంత అందంగా ఉండటానికి ఏం తింటాడో అని అనేకసార్లు మహేష్ ని అడిగినా నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు.

Mahesh babu : మహేష్ బాబు బ్రేక్ ఫాస్ట్ ఏం తింటాడో తెలుసా? తన న్యూట్రిషనిస్ట్ గురించి బయటపెట్టిన మహేష్..

Mahesh babu shares his Breakfast and tells about his Nutritionist

Updated On : July 18, 2023 / 12:58 PM IST

Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్రాడిలా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మహేష్ కి అమ్మాయిల్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ అంత అందంగా, అంత ఫిట్ గా ఎలా ఉంటాడు అని అభిమానులతో పాటు అందరూ సందేహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. అంత అందంగా ఉండటానికి ఏం తింటాడో అని అనేకసార్లు మహేష్ ని అడిగినా నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు.

మహేష్ ఇప్పటికి కూడా అంత అందంగా, ఫిట్ గా ఉండటానికి కారణం ముఖ్యంగా ఫుడ్. గతంలో కూడా పలు సార్లు మహేష్ ఇదే చెప్పాడు. నేను ఏది పడితే అది తినను, ఫుడ్ లో జాగ్రత్తగా ఉంటాను అని తెలిపాడు. తనకి సపరేట్ కుక్ కూడా ఉంటాడు. షూటింగ్స్ కి వెళ్లినా అక్కడి ఫుడ్ తినకుండా తన కుక్ వండిందే తింటాడని గతంలో తెలిపారు మహేష్. మహేష్ డైరీ ప్రొడక్ట్స్, స్వీట్స్ కూడా ఏవి తినను అని చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో.

తాజాగా తను రోజూ ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను బ్రేక్ ఫాస్ట్ తింటున్న ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. ఇది నా డైలీ రొటీన్. రాత్రంతా నానబెట్టిన ఓట్స్, కొన్ని మొలకెత్తిన గింజలు, విత్తనాల్ని కలిపి తీసుకుంటాను. కొన్ని గంటల వరకు నాకు ఇదే పవర్ ని ఇస్తుంది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అని తెలిపాడు. అలాగే తన న్యూట్రిషనిస్ట్ ల్యూక్ కౌంటినోని ట్యాగ్ చేసి ఒక మంచి న్యూట్రీషియన్ అని చెప్పాడు మహేష్.

Japan : తెలుగు సినిమాలకు కొత్త మార్కెట్ జపాన్.. మన సినిమాలపై కోట్లు కురిపిస్తున్న జపాన్ అభిమానులు..

దీంతో మహేష్ షేర్ చేసిన ఈ ఫోటో, మ్యాటర్ వైరల్ గా మారాయి. రోజూ మహేష్ పొద్దున్నే తినే బ్రేక్ ఫాస్ట్ ఇదే అన్నమాట అని అనుకుంటున్నారు. మహేష్ అంత జాగ్రత్తగా తింటాడు కాబట్టే అలా ఉంటున్నాడు, మనం అన్ని తినేయాల్సిందే అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎవరైనా అభిమానులు మహేష్ చేసే బ్రేక్ ఫాస్ట్ తినడానికి ట్రై చేస్తారా లేదా మహేష్ సజెస్ట్ చేసిన న్యూట్రీషియన్ దగ్గరికి వెళ్తారేమో చూడాలి.

Mahesh babu shares his Breakfast and tells about his Nutritionist