Guntur Kaaram : ‘కుర్చీ మడతపెట్టి’.. సరికొత్త రికార్డ్ సెట్ చేసిన మహేష్ బాబు, శ్రీలీల..

గుంటూరు కారం సినిమా విజయంలో పాటలకు కూడా భాగం ఉంది. సినిమా రిలీజ్ ముందే 'కుర్చీ మడతపెట్టి..' అంటూ వచ్చిన సాంగ్ బాగా వైరల్ అయింది.

Guntur Kaaram : ‘కుర్చీ మడతపెట్టి’.. సరికొత్త రికార్డ్ సెట్ చేసిన మహేష్ బాబు, శ్రీలీల..

Mahesh Babu Sreeleela Guntur Kaaram Kurchi Madathapetti Song creates new Record in You tube

Updated On : February 16, 2024 / 8:21 PM IST

Guntur Kaaram : ఇటీవల సంక్రాంతికి త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా గుంటూరు కారం సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్మోస్ట్ 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ, మీనాక్షి చౌదరి, జయరామ్, ప్రకాష్ రాజ్, ఈశ్వరిరావు, వెన్నెల కిషోర్, రావు రమేష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

గుంటూరు కారం సినిమా విజయంలో పాటలకు కూడా భాగం ఉంది. సినిమా రిలీజ్ ముందే ‘కుర్చీ మడతపెట్టి..’ అంటూ వచ్చిన సాంగ్ బాగా వైరల్ అయింది. స్పెషల్ సాంగ్ గా సినిమాలో చూపించారు. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీల కలిసి స్టెప్పులు అదరగొట్టేసారు. మరో నటి పూర్ణ కూడా ఈ సాంగ్ లో స్టెప్పులేసింది.ఇక థియేటర్స్ లో అయితే ఈ పాటకి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు.

Also Read : Raviteja – Priyamani : 14 ఏళ్ళ తర్వాత కలిసిన ప్రియమణి, రవితేజ.. ‘ఈగల్ 2’లో ప్రియమణి?

తాజాగా ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. కుర్చీ మడతపెట్టి లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్స్ వ్యూస్ సాధించింది. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కుర్చీ మడతపెట్టి అంటూ స్టెప్పులేస్తున్నారు.