షూటింగ్‌లో ప్రమాదం.. ICUలో యంగ్ హీరో..

Tovino Thomas critically injured: మళయాళ యువ నటుడు టొవినో థామస్ తీవ్ర గాయాలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. థామస్ నటిస్తున్న ‘కాలా’ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించారు.
Tovino Thoma కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోందని, కండిషన్ సీరియస్‌గా ఉందని 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. థామస్ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడాలని మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారు ఆకాంక్షిస్తున్నారు.
టొవినో థామస్ ‘లూసిఫర్’ మూవీలో మోహన్‌లాల్ తమ్ముడుగా నటించాడు. తను హీరోగా నటించిన ‘ఫోరెన్సిక్’ చిత్రం ఇటీవలే తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు టొవినో థామస్.