Yatra 2 Trailer : యాత్ర 2 ట్రైలర్ చూశారా? శత్రువులకు తల వంచరు..

యాత్ర సినిమాకి సీక్వెల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయింది.

Yatra 2 Trailer : యాత్ర 2 ట్రైలర్ చూశారా? శత్రువులకు తల వంచరు..

Mammootty Jiiva Mahi V Raghav Yatra 2 Trailer Released

Updated On : February 6, 2024 / 5:17 PM IST

Yatra 2 Trailer : వైఎస్సార్(YSR) బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 రాబోతుంది. యాత్రలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించగా అదే పాత్రని కంటిన్యూ చేస్తూ వైఎస్ జగన్(YS Jagan) బయోపిక్ గా యాత్ర 2 తీసుకొస్తున్నారు. తమిళ నటుడు జీవా ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమానిని త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఓ పేద మహిళ తన కూతురి ఆపరేషన్ కోసం వైఎస్సార్ వద్దకు వస్తే ఆరోగ్యశ్రీ పథకం ఆలోచనతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత వైఎస్సార్ మరణం, ఆ తర్వాత జరిగిన రాజకీయాలు, జగన్ జనాల్లోకి వెళ్లడం.. లాంటి అంశాలతో ట్రైలర్ సాగింది. చివర్లో వైఎస్సార్ లాగే జగన్ కూడా నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్ చెప్పడంతో ముగించారు.

Also Read : Dasari Kondappa : దిల్ రాజు మంచి మనసు.. పద్మశ్రీ వచ్చిన ‘బలగం’ కళాకారుడికి లక్ష రూపాయలు..

ఈ ట్రైలర్ చూస్తుంటే వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. కథాంశంతో ఉండనుంది యాత్ర 2. సినిమాని ఎమోషనల్ కథాంశంతో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ నటిస్తున్నారు.