బాలయ్య పోస్టర్ చూశారు.. బతికిపోయారు.. : ‘మనకథ’ టీజర్
వేణు, రమ్యకృష్ణలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. నిర్మిస్తున్న సినిమా ‘మనకథ’.. టీజర్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు..

వేణు, రమ్యకృష్ణలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. నిర్మిస్తున్న సినిమా ‘మనకథ’.. టీజర్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు..
వేణు, రమ్యకృష్ణలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. క్యూబీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అవుట్ స్టాండింగ్ వర్క్స్ టీమ్ కలిసి నిర్మిస్తున్న సినిమా ‘మనకథ’.. అఫ్జల్ షేక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. టీజర్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ గురించి, మాస్ సినిమా పవర్ గురించి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి..
హీరోయిన్ : ‘నీకు ఈ మాస్ సినిమాల పిచ్చేంటి?’ అని అడిగితే.. హీరో : ‘మా నాన్నాకి సీడెడ్‌లో ఒక థియేటర్ ఉంది.. అప్పట్లో వరసగా ఫ్లాప్ సినిమాలు కొని దారుణంగా నష్టపోయాడు.. కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మందు తెచ్చాడు.. ఆ పురుగుల మందుకి చుట్టుకుని ఓ న్యూస్ పేపర్ ఉంది.. ఆ న్యూస్ పేపర్‌లో ఒక పోస్టర్ ఉంది.. దాని పేరు.. నరసింహనాయుడు.. పది ఫ్లాప్ సినిమాలతో పోగొట్టుకున్న డబ్బంతా, ఒక్క మాస్ సినిమా తిరిగి తీసుకొచ్చి పెట్టింది.. దట్స్ ది పవర్ ఆఫ్ మాస్ సినిమా’.. అంటూ చెప్పే టీజర్ ఆకట్టుకుంటుంది..
Read Also : ఖైదీ’ సీక్వెల్ ‘ఢిల్లీ’
డైరెక్టర్ కూడా బాలయ్య ఫ్యాన్ అయింటాడు.. అందుకే బాలయ్య మాస్ పవర్, సీడెడ్‌లో బాలయ్య సినిమాల స్టామినా గురించి కరెక్ట్‌గా చెప్పాడు.. బాలయ్య ఫ్యాన్స్ ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. రచన : ఎస్‌కె గౌస్ ఖాజా, సంగీతం : వంశీకాంత్, ఎడిటింగ్ : కళాణ్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, డైరెక్షన్ : అఫ్జల్ షేక్.