Mansoor Ali Khan : సినిమాలో త్రిషని రేప్ చేసే ఛాన్స్ రాలేదు.. నటుడు సంచలన వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన త్రిష..

తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.

Mansoor Ali Khan : సినిమాలో త్రిషని రేప్ చేసే ఛాన్స్ రాలేదు.. నటుడు సంచలన వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన త్రిష..

Mansoor Ali Khan Disgusting Comments on Trisha goes Viral Trisha Counter Tweet

Updated On : November 19, 2023 / 9:23 AM IST

Mansoor Ali Khan : విలన్ రోల్స్ ఎక్కువగా చేసే తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. పలు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తాడు. కొన్ని రోజుల క్రితమే జైలర్(Jailer) సినిమాలో తమన్నా(Tamannaah) సాంగ్ పై వల్గర్ కామెంట్స్ చేసి వివాదం సృష్టించాడు. తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.

మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. నేను చాలా సినిమాల్లో రేప్ సీన్స్ చేశాను. కుష్బూ, రోజా.. ఇలా చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ లో నేను చాలా ఎంజాయ్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో(Trisha) రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను. కానీ సినిమాలో అలాంటి సీన్ లేదు అని బాధపడ్డాను అని అన్నాడు. దీంతో మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తమిళ పరిశ్రమలో సంచలనంగా మారాయి.

పలువురు త్రిష అభిమానులు, నెటిజన్లు మన్సూర్ అలీఖాన్ ని విమర్శిస్తూ కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మన్సూర్ అలీఖాన్ ని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అతనికి ఇకపై సినిమా ఆఛాన్సులు ఇవ్వొద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో త్రిష వరకు వెళ్లడంతో త్రిష దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేసింది.

Also Read : Bigg Boss 7 Day 76 : ఇక నుంచి కెప్టెన్సీ టాస్క్ లు ఉండవు.. ఆ పదాలు బ్యాన్.. కంటెస్టెంట్స్ కి వీకెండ్ షాక్ ఇచ్చిన నాగార్జున..

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలకు త్రిష స్పందిస్తూ.. మన్సూర్ అలీఖాన్ నా గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ వీడియో నా దృష్టికి వచ్చింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది స్త్రీని ద్వేషిస్తూ, అగౌరవపరుస్తూ, చెడుగా చూపిస్తున్నట్టు ఉంది. ఇతని లాంటి వ్యక్తితో నేను ఎప్పుడూ కలిసి నటించినందుకు సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను. ఇలాంటి వారి వల్ల మనుషులకు చెడ్డపేరు వస్తుంది అని ట్వీట్ చేసింది. దీంతో త్రిష ట్వీట్ వైరల్ గా మారింది.

 

ఇక ఈ వ్యాఖ్యలపై లియో సినిమా దర్శకుడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా స్పందించాడు. త్రిష చేసిన పోస్ట్ ని రీషేర్ చేస్తూ.. మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు విని నిరుత్సాహపడ్డాను. కోపం కూడా వచ్చింది. మేమంతా ఒకే జట్టులో కలిసి పనిచేశాము. మహిళలు, తోటి కళాకారులపై గౌరవం ఏ పరిశ్రమలోనైనా ఉండాలి. మన్సూర్ వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.