Chiranjeevi : ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా.. చిరంజీవి
యోగా దినోత్సవాన్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

Mega star chiranjeevi post about international yoga day
యోగా దినోత్సవాన్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. యోగా అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.
” ఫోకస్ వల్ల ఫిట్‌నెస్ పెరుగుతుంది. అయితే.. యోగా వల్ల ఈ రెండూ వస్తాయి. యోగా డేను కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన గొప్ప బహుమతి యోగా. జూన్ 21న దీన్ని (యోగా డే) ను సెలబ్రేట్ చేసుకుందాం.” అని చిరంజీవి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Balakrishna vs Pawan Kalyan : బాలయ్య వర్సెస్ పవన్.. థియేటర్లలో రచ్చ రచ్చే..
Fitness starts with focus—and Yoga builds both!
This #IDY2025, let’s breathe deep and rise higher.
Yoga 🧘 is India’s gift to the world.
Let’s celebrate it together on
21 st June, across borders,
across hearts.@moayush #YogaForOneEarthOneHealth #InternationalDayOfYoga…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు.
Akhanda 2 : బాలయ్య ‘అఖండ 2’ టీజర్.. గూస్ బంప్స్ అంతే..
ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.