Chiranjeevi : మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలు ఇవేనా..? ఆ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడా?

మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. దీనికి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్.

Chiranjeevi : మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలు ఇవేనా..? ఆ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడా?

Megastar chiranjeevi next movies lineup with these directors

Updated On : June 17, 2023 / 4:42 PM IST

Megastar Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) సూపర్ హిట్ తో మరింత స్పీడ్ పెంచారు. వరస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం చిరు మెహర్ రమేశ్(Mehar Ramesh) డైరెక్షన్ లో ‘బోళా శంకర్’(Bhola Shankar) మూవీలో నటిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తర్వాత ఆయన వరస పెట్టి సినిమాలు చేయబోతున్నారని సమాచారం. బంగార్రాజు(Bangarraju) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) డైరెక్షన్ లో ఒక మూవీ, బింబిసార(Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట(Mallidi Vashist) డైరెక్షన్ లో మరో సినిమాను చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. దీనికి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్. అయితే ఇదే మూవీలో మెగాస్టార్ కొడుకు పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ నటించబోతున్నట్టు, చిరు భార్యగా త్రిష నటించబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ కాంబో మూవీ ఖాయమైనప్పటికీ అందులోని ఇతర పాత్రలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ కోసం సిద్ధూ హైయస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇది బ్రో డాడీ మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మల్లిడి వశిష్ట ఇప్పుడు చిరంజీవి కోసం ఓ సోషియో ఫాంటసీ స్టోరీని రాశాడని సమాచారం. ఈ మూవీ ప్రకటన త్వరలోనే వస్తుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ మూవీగా తెరకెక్కబోతోందని టాక్. మానవుడైన హీరో మూడు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడట. ఆ లోకాల్లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలొస్తున్నాయి. దీనికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలపై అధికారిక సమాచారం లేకపోయినా ఈ కాంబినేషన్స్ లో మాత్రం సినిమాలు ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.