నా దగ్గరికి ఎవ్వరూ రావద్దు: మోహన్ బాబు

కరోనా వైరస్(కోవిడ్-19) కట్టడి కోసం ప్రభుత్వాలు పాఠశాలలు, పార్కులు, సినిమాహాళ్లు, మ్యూజియాలు ఇప్పటికే మూసివేశారు తెలంగాణలో అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సినిమా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేశ్ బాబు సైతం సందేశాలు అందించారు. లేటెస్ట్‌గా సినీనటుడు మోహన్ బాబు కరోనా కారణంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోండగా.. విశ్వవ్యాప్తంగా ‘ కరోనా’ మరణాల సంఖ్య ఏడు వేల మార్కు దాటడంతో.. ఈ ఏడాది మార్చి 19న తన పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసినట్లు వెల్లడించారు.
ఈ మేరకు విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో పేరుతో లేఖను విడుదల చేశారు. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆత్మీయ విన్నపం… pic.twitter.com/JRnfYWdgUS
— Mohan Babu M (@themohanbabu) March 17, 2020