రూ.50 కోట్ల క్లబ్ లో సూపర్ స్టార్ సినిమా

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 10:09 AM IST
రూ.50 కోట్ల క్లబ్ లో సూపర్ స్టార్ సినిమా

Updated On : April 1, 2019 / 10:09 AM IST

ఇటీవలే పులి జూదం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ఢిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తున్న మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిలర్ నేపథ్యంలో లూసిఫర్ సినిమా చేశాడు. మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం ‘లూసిఫెర్’ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. గురువారం విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అంతేకాకుండా మలయాళం లో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. ఇక ఇటీవల ఒడియన్ తో ప్లాప్ ను ఖాతాలో వేసుకున్న మోహన్ లాల్ మళ్ళీ ఈ లూసిఫెర్ తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యారు. భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నా ఈ సినిమా ఈ సమ్మర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.