Mrunal Thakur: సీతా రామం దెబ్బ అమ్మడికి గట్టిగానే తగిలినట్టు ఉందిగా!
టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘సీతా రామం’ ప్రేక్షకులను అలరించడంలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.

Mrunal Thakur Flooded With Offer After Sita Ramam Blockbuster
Mrunal Thakur: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘సీతా రామం’ ప్రేక్షకులను అలరించడంలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Mrunal Thakur In For NTR 30: తారక రాముడి కోసం కదలివస్తున్న సీతా..?
ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇందులో నటించిన నటీనటులకు అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్‌కు కొత్తగా కనిపించిన మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో వరుసబెట్టి ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. ఇప్పటికే ప్రముఖ బ్యానర్లు మృణాల్ ఠాకూర్ కోసం క్యూ కడుతుండగా, రీసెంట్గా ఓ స్టార్ హీరో సినిమా ఛాన్స్ కూడా అమ్మడి చెంతకు వచ్చిందట. అయితే ఈ బ్యూటీ మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ వెళ్తోందని తెలుస్తోంది.
Mrunal Thakur : ఆ సినిమా చూపించాకే నన్ను సినిమాల్లోకి పంపించారు.. లేకపోతే డెంటిస్ట్ అయ్యేదాన్ని..
ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఓ హీరో సినిమాను ఓకే చేసిన ఈ బ్యూటీ, మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రెడీ అవుతోంది. మరి సీతా రామం ఎఫెక్ట్‌తో వరుస ఆఫర్లు కొట్టేస్తున్న మృణాల్ ఠాకూర్, త్వరలో మనముందుకు ఏ సినిమాతో వస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.