Mrunal Thakur : తెలుగు నేర్చుకోవడానికి మృణాల్ ఎంత కష్టపడుతుందో చూడండి.. హీరోయిన్స్ అంతా ఇలా నేర్చుకుంటే బాగుండు..

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అభిమానులు పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు. తెలుగు, హిందీ భాషల్లో ఆఫర్స్ కూడా వరుసగా వస్తున్నాయి.

Mrunal Thakur : తెలుగు నేర్చుకోవడానికి మృణాల్ ఎంత కష్టపడుతుందో చూడండి.. హీరోయిన్స్ అంతా ఇలా నేర్చుకుంటే బాగుండు..

Mrunal Thakur Learning Telugu in Midnight very Hardly Video goes Viral

Mrunal Thakur :  మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ కూడా ఉంది. సీరియల్స్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు మృణాల్ ఠాకూర్ కి తెలుగులో సీతారామం(Sita Ramam) ఒక్క సినిమాతో వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజయి మంచి విజయం సాధించింది. ఇందులో మృణాల్ చేసిన సీత క్యారెక్టర్ అందర్నీ మెప్పించింది.

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అభిమానులు పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు. తెలుగు, హిందీ భాషల్లో ఆఫర్స్ కూడా వరుసగా వస్తున్నాయి. దీంతో మృణాల్ తనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన తెలుగు వాళ్లకు స్పెషల్ గా ఇప్పటికే చాలా సార్లు థ్యాంక్స్ చెప్పింది. తన తెలుగు అభిమానుల కోసం ఏం చేయాలి అని ఆలోచించిందేమో, అందుకే ఈ పని చేస్తుంది.

సాధారణంగా మన తెలుగులో ఎక్కువగా కన్నడ, బాంబే హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నా, డబ్బులు సంపాదించినా మన తెలుగు మాత్రం నేర్చుకోరు, మాట్లాడారు. ఇక్కడ సినిమా ప్రమోషన్స్ లో ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఏదో ఫార్మాలిటీకి రెండు తెలుగు ముక్కలు మాట్లాడతారు. స్టార్ హీరోయిన్స్ గా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న పక్క స్టేట్ హీరోయిన్స్ కూడా ఇప్పటికి తెలుగులో మాట్లాడలేరు. కానీ మృణాల్ ఠాకూర్ తెలుగులో ఒక్క సినిమానే చేసినా మెల్లి మెల్లిగా తెలుగు మాట్లాడటానికి ట్రై చేస్తుంది.

Siya gautam : నేనింతే హీరోయిన్ శియా గౌతమ్ గుర్తుందా? ఇప్పుడు వెబ్ సిరీస్‌తో రాబోతుంది.. ఎందులోనో తెలుసా?

ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమా ఆఫర్స్ వస్తుండటంతో తెలుగు నేర్చుకుంటుంది. రాత్రి పూట ల్యాప్ టాప్ లో ఆన్లైన్ లో బట్టి పట్టి మరీ, రాసుకుంటూ తెలుగు నేర్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెనకాల ఓ తెలుగు అమ్మాయి కూడా తన తప్పులని సరిదిద్దుతున్నట్టు ఉంది ఆ వీడియోలో. ప్రస్తుతం మృణాల్ హాయ్ నాన్న సినిమా షూట్ లో ఉంది. ఈ షూటింగ్ లోనే ఇలా రాత్రి పూట తెలుగు కష్టపడి నేర్చుకుంటుంది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు మృణాల్ ఠాకూర్ ని తెలుగు నేర్చుకుంటున్నందుకు అభినందిస్తున్నారు. మరి రాబోయే సినిమా ప్రమోషన్స్ లో తెలుగు మాట్లాడి ఇక్కడి అభిమానులని మెప్పిస్తుందేమో మృణాల్ చూడాలి. ఇక మృణాల్ ఇలా తెలుగు కష్టపడి మరీ నేర్చుకుంటుండటంతో వేరే హీరోయిన్స్ కూడా మృణాల్ లా తెలుగు నేర్చుకుంటే ఎంత బాగుంటుందో, మృణాల్ ని చూసి వేరే హీరోయిన్స్ నేర్చుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు.