Thaman – Mahesh Babu : జస్ట్ 12 నిమిషాల్లో పాట రెడీ.. ఆర్జీవీ విని బాగోలేదు అంటే.. మహేష్ బాబు మాత్రం..

తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన లైఫ్ లోనే చాలా ఫాస్ట్ గా చేసిన సాంగ్ ట్యూన్ గురించి మాట్లాడారు.

Thaman – Mahesh Babu : జస్ట్ 12 నిమిషాల్లో పాట రెడీ.. ఆర్జీవీ విని బాగోలేదు అంటే.. మహేష్ బాబు మాత్రం..

Music Director Thaman Reveals about his fast Composing Song RGV Mahesh Babu Reactions

Updated On : April 16, 2025 / 5:30 PM IST

Thaman – Mahesh Babu : సాధారణంగా ఒక పాట ట్యూన్ రెడీ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. ఒక్కోసారి ట్యూన్ తొందరగా వచ్చేస్తుంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన లైఫ్ లోనే చాలా ఫాస్ట్ గా చేసిన సాంగ్ ట్యూన్ గురించి మాట్లాడారు.

తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్లో ఫాస్ట్ గా చేసిన ట్యూన్ అంటే బిజినెస్ మెన్ సినిమాలో సారొస్తారొస్తారా.. సాంగ్. జస్ట్ 12 నిమిషాల్లో సాంగ్ చేసేసాను. ఆ సినిమాలో అన్ని డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. నేనే పూరి జగన్నాధ్ దగ్గరికి వెళ్లి మహేష్ గారికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా ఒక మెలోడీ పాట పెడితే బాగుంటుంది అన్నాను. పూరి సరే పాట ఎక్కడ పెడదాం అని ఆలోచించి ఒక సీన్ తర్వాత పెట్టొచ్చు అని చెప్పి నేను పది నిమిషాల్లో వస్తాను పాట రెడీ చేసేయండి అన్నారు.

Also Read : Bobby Deol : ఒకప్పుడు భార్య సంపాదన మీద బతికి.. ఇప్పుడు రీ ఎంట్రీలో ఖరీదైన కార్ కొన్న బాలీవుడ్ స్టార్.. కార్ విలువ ఎన్ని కోట్లు తెలుసా?

నేను, భాస్కర్ భట్ల వెళ్లి సాంగ్ చేసేసాము. నేను ట్యూన్ చేయగానే వెంటనే లిరిక్స్ రాసారు భాస్కర్ భట్ల. సుబ్బరాజు, పూరి జగన్నాధ్ వచ్చి పాట విన్నారు. సుబ్బరాజు అయితే ఈ పాటతో సినిమా వేరే లెవల్ అన్నాడు. పూరికి డౌట్ గా ఉంది. ఆర్జీవీకి వినిపిస్తే ఏంటి ఈ సాంగ్.. బాగోలేదు అన్నారు. నెక్స్ట్ డే దూకుడు 100 డేస్ ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్లి మహేష్ గారికి పాట వినిపిస్తే మైండ్ బ్లోయింగ్ తమన్ అన్నారు. మహేష్ గారు చెప్పడంతో ఆ పాట ఫిక్స్ చేసేసారు. ఆ సాంగ్ పెద్ద హిట్ అయి చాలా డబ్బులు వచ్చాయని ఆడియో కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు అని తెలిపాడు.

Also Read : Pooja Hegde : పూజ హెగ్డే తాతయ్య నేషనల్ లెవల్ అథ్లెట్ అని తెలుసా? ఆ రికార్డు కూడా పూజ తాతయ్య పేరు మీదే..