Shah Rukh Khan: షష్టిపూర్తి చేసుకుంటున్న షారుఖ్.. ముంబైలో గ్రాండ్ ఈవెంట్.. మెగా ఫ్యామిలీకి ఆహ్వానం?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ త్వరలో 60వ ఏటా అడుగుపెట్టనున్నాడు.(Shah Rukh Khan) నవంబర్ 2న ఆయన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అదేరోజు ఆయన షష్టిపూర్తి వేడుక కూడా జరుగనుంది.

Shah Rukh Khan: షష్టిపూర్తి చేసుకుంటున్న షారుఖ్.. ముంబైలో గ్రాండ్ ఈవెంట్.. మెగా ఫ్యామిలీకి ఆహ్వానం?

Shah Rukh Khan's Shashtipurthi celebrations to be held in Mumbai

Updated On : October 31, 2025 / 6:41 PM IST

Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ త్వరలో 60వ ఏటా అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 2న ఆయన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అదేరోజు ఆయన షష్టిపూర్తి వేడుక కూడా జరుగనుంది. ముంబైలో ఘనంగా ఈ ఈవెంట్ జరుగనుంది. అయితే, (Shah Rukh Khan)ప్రతీ ఏటా జరిగేలా షారుఖ్ ఖాన్ ఇల్లు మన్నత్ లో ఈ ఈవెంట్ జరగడం లేదు. కారణం ఏంటంటే, మన్నత్ లో ప్రస్తుతం రిపేర్ వర్క్ జరుగుతోంది. అందుకే, అలీబాగ్‌లోని షారుఖ్ ఫార్మ్‌హౌస్‌లో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఇప్పటికే ఈ ఈవెంట్ కి సంబందించిన ఇన్విటేషన్ లు కూడా వెళ్లాయి.

Sai Durga Tej: ఆ వార్తల్లో నిజం లేదు.. త్వరలో నేనే చెప్తాను.. క్లారిటీ ఇచ్చేసిన మెగా హీరో

వారిలో బాలీవుడ్ స్టార్స్, దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుగనున్నాయి. ఇక టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీకి ఈ ఈవెంట్ కి సంబందించిన ఇన్విటేషన్ అందినట్లు తెలుస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఈ వేడుకలకు హాజరుకానున్నారని తెలుస్తోంది. అంతేకాదు టాలీవుడ్ నుంచి మరికొందరికి కూడా ఇన్విటేషన్ అందినట్టు సమాచారం. ఇక ఇదే ఈవెంట్ లో తన అభిమానులకు మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడట షారుఖ్ ఖాన్.

అదేంటంటే, ఆయన హీరోగా వస్తున్న కొత్త మూవీ “కింగ్”. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా నుంచి షారుఖ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారట మేకర్స్. ఈ విషయంపై దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఒకే రోజు రెండు భారీ ట్రీట్ లు ప్లాన్ చేశాడు షారుఖ్. ఈ న్యూస్ తెలిసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.